మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎన్నో పరిణామాలు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా  దేవేంద్ర ఫడ్నవిస్  ముఖ్యమంత్రి గా బీజేపీకి మద్దతు తెలిపిన ఎన్సీపీ  నేత అజిత్ పవార్ ఉప  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. అయితే తాజాగా ఉప ముఖ్యమంత్రి పదవికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజీనామా చేయడం సంచలనం గా మారిన విషయం. అంటే ఇంకొద్దిసేపట్లో మహా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు రాగా అది నిజమైంది. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు నిర్వహించిన  దేవేంద్ర ఫడ్నవిస్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బిజెపి ప్రభుత్వానికి ప్రజామోదం తో ఉందని  తెలిపారు. 

 

 

 

 అయితే మహారాష్ట్రలు కర్ణాటక రాజకీయం రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. కర్ణాటకలో కూడా మొదట బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేయగా ఆ తర్వాత బీజేపీకి షాక్ ఇస్తూ... జేడీఎస్  కాంగ్రెస్ పొత్తుతో  ప్రభుత్వం ఏర్పాటైంది. కర్ణాటకలో కూడా మహారాష్ట్ర వలె బీజేపీకి అధిక మెజార్టీ వచ్చింది. అయినప్పటికీ కర్ణాటకలో చిన్న పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ తో అందరూ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం తో మరోసారి బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అయిపోయింది. ఇప్పుడు మహా రాజకీయాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.

 

 

 

 సరికొత్త వ్యూహంతో  అధికారం ఏర్పాటు చేసిన బిజెపి పార్టీ సంఖ్యా బలం లేకపోవడంతో తాజాగా ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన ఈ మూడు పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ మూడు పార్టీల కూటమితో  ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ ఈ మూడు పార్టీల మధ్య ఒకవేళ విభేదాలు తలెత్తితే ప్రభుత్వం కూలిపోనుంది . అంతే కాకుండా అటు అన్ని రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు సరికొత్త వ్యూహాలతో  మోదీ అమిత్ షా లు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే... శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ... మహా రాజకీయాల్లో కూడా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని బీజేపీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. 

 

 

 

 ఈ క్రమంలోనే కర్ణాటక శీను మహారాష్ట్ర లోని ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో  బిజెపి శివసేన కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ వ్యూహాలు రచించక  మానదు అని ప్రస్తుతం మహ  రాజకీయల్లో  చర్చలు నడుస్తున్నాయి. బిజెపి ప్రభుత్వం కూలిపోయినప్పటికీ  ఆ తర్వాత ఎమ్మెల్యేలను ఆకర్షించి కర్ణాటక సీన్ రిపీట్ చేసి  మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: