ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో  మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. అలాగే పొలిసు యంత్రాంగాన్ని కునుకులేకుండా చేస్తున్నాయి. మావోయిస్టులు ఇటీవల జరుగుతున్న మరియు వెలువడుతున్న భూకుంభకోణాలు, అన్యాయాలు, పేదప్రజల బాధలు దృష్టిలో ఉంచుకొని   ఈ నెల 17న, 24న వేర్వేరుగా రెండు కరపత్రాలు విడుదల చేసి  కలకలాన్ని సృష్టిస్తున్నారు. గడచిన వారం రోజుల్లో జిల్లాలో నాలుగు సార్లు కరపత్రాలు విడుదల కావడంతో టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, అధికారుల్లో అలజడి మొదలైంది. ముఖ్యంగా అధికార పార్టీ తెరాస నాయకులు, బీజేపి నాయకులు, అధికారులకు హెచ్చరికలు  చేస్తూ విడుదల ఆయన కరపత్రాలు  ఆందోళనకు గురి చేస్తుంది. జిల్లాలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని అధికార పార్టీ నాయకులు, అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 
దీనికి కొందరు మేము ఎలాంటి తప్పులు చేయలేదని తాము చేయని తప్పుకు భయపడాల్సిన  అవసరం లేదని ధైర్యంగా మావోయిస్టుల హెచ్చరికలను తప్పికొట్టారు. మరికొంత మంది ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా అబియోగం మరియు హెచ్చరికలకు గురైన కొందరు ప్రముఖుల ఎవరి వారి పద్దతులలో స్పందించారు. లంచగొండి అధికారులు, రాజకీయ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూ మహదేవపూర్‌ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేరుతో విడుదలైంది. ఈమె రియల్‌ ఎస్టేట్‌ దందాలు,  భూ ఆక్రమాలు, గుండాయిజం, అవినీతి అక్రమాలు, పైరవీల పెత్తనాలు చేస్తూ 34 ఎకరాల భూమిని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అందులో ఆరోపించారు. అదేవిదంగా జిల్లాలోని వెంకటాపురం  మండలంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూ దందాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడి ప్రశ్నించిన వారిని పోలీసుల సహాయంతో  అడిగినవారికి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ మీరు మారకపోతే పరిణామాలు చాల ఘోరంగా ఉంటాయని హెచ్చరించారు  అలాగే ఈ విషయంపై స్పందించిన ఉమ్మడి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా  రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ పల్లా బుచ్చయ్య ములుగులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కరపత్రాల ద్వారా నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న మావోయిస్టులు ఇప్పుడు ఎం జరుగుతుందోనని భయబ్రాంతులతో బ్రతుకుతున్నారు ఈ నేపథ్యం లో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: