మరాఠా యోధునిగా పాపులరైన శరద్ పవార్ మైండ్ గేమ్ లో బాగా సక్సెస్ అయ్యారు. బలపరీక్షకు 24 గంటల ముందే సిఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారంటేనే శరద్ తిప్పిన చక్రం ఏ స్ధాయిలో పనిచేసిందో అర్ధమైపోతోంది. ఫడ్నవీస్ రాజీనామాకు కొద్ది గంటల ముందే డిప్యుటి సిఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్సీపి చీలిక వర్గం నేత అజిత్ పవార్ రాజీనామా చేయటంతోనే శరద్ మైండ్ గేమ్ ఏ స్ధాయిలో వర్కవుటయ్యిందో అర్ధమైపోతోంది.

 

నిజానికి ఎన్సీపి ఎంఎల్ఏల్లో చీలిక తెచ్చి మేనల్లుడు అజిత్ పవార్ బిజెపికి మద్దతు పలకటం కూటమితో పాటు వ్యక్తిగతంగా శరద్ పవార్ కు పెద్ద షాకనే చెప్పాలి. అటువంటి షాకునే అదే అజిత్ పవార్ తో  రాజీనామా చేయించి బిజెపికి శరద్ షాక్  ఇప్పించి అంతకంతా  బదులు తీర్చుకున్నారు.

 

అసలు శరద్ మైండ్ గేమ్ మొత్తం మూడు రోజుల క్రితమే మొదలైంది. తన కూతురు వరసకు అజిత్ కు సోదరయ్యే సుప్రియా సూలేతో శరద్ పవార్ గేమ్ మొదలుపెట్టారు. పదే పదే తన కూతురు మొబైల్ నుండి అజిత్ మొబైల్ కు మెసేజ్ లు ఇప్పించారు. బిజెపి పొత్తుల నుండి బయటకు వచ్చేయమని తిరిగి పార్టీలోకి వచ్చేయాలంటూ పదే పదే ఎస్ఎంఎస్ లు ఇప్పించారు.

 

అదే విధంగా ఎన్సీపిలో అజిత్ కు బాగా సన్నిహితంగా ఉండే నేతలతో కూడా అజిత్ కు ఎస్ఎంఎస్ లు ఇప్పించారు. మొత్తం మీద కొన్ని వందల ఎస్ఎంఎస్ లు ఇప్పించారు అజిత్ కు. అలాగే తన కుటుంబంసభ్యులతో కూడా అజిత్ తో మాట్లాడించారు. అంటే అజిత్ పై శరద్ మానసిక యుద్ధమే చేసినట్లు తెలిసిపోతోంది. బిజెపితో పొత్తు వదులుకుని తిరిగొచ్చేస్తే పార్టీలో మునుపటి స్ధాయినే ఇస్తామని హామీ ఇచ్చారు.

 

కూటమి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత ఇస్తామంటూ శివసేన దగ్గర నుండి కూడా హామీలిప్పించారు. అదే సమయంలో తనపై ఉన్న కేసులన్నింటినీ  సిఎంగా బాధ్యతలు తీసుకోగానే  ఫడ్నవీస్ కూడా ఎత్తేశారు. దాంతో శరద్ మైండ్ గేమ్ కు లొంగిపోయిన అజిత్ మంగళవారం మధ్యాహ్నం డిప్యుటి సిఎంగా  రాజీనామా చేసేశారు.

 

ఎప్పుడైతే అజిత్ రాజీనామా చేశారని తెలిసిందో తాను కూడా రాజీనామా చేయక తప్పదని ఫడ్నవీస్ కు అర్ధమైపోయింది. మొత్తానికి శరద్ పవార్ మైండ్ గేమ్ మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: