ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి ఒకరే ఉంటారు. కానీ చిత్రమేంటంటే ఈ మధ్య చాలా మంది తయారవుతున్నారు. బయట కనిపించే ముఖం  ఒకరిదైతే వెనక నుంచి అంటే బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేసేవారు ఎక్కువగా  ఉంటున్నారు.  మహారాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు ముఖ్యమంత్రి ఒక్కరు కాదు ఎందరో అన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వం అయితే ఏర్పాటు అవుతుంది కానీ పాలన ఎవరు చేస్తారో, ఎవరు చేయిస్తారో అంతా ఒక రాజకీయ కధగానే ఉందని అంటున్నారు.

 

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న ఉధ్ధవ్ థాక్రేకి ఎటువంటి పాలనానుభవం లేదు. ఆయన కనీసం వార్డు మెంబర్ కూడా పోటీ చేయలేదు. బాలఠాక్రే వారసుడుగా పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఇక తన కుమారుడు ఆదిత్య ఠాక్రేని సీఎం చేయాలనుకున్నారు. ఓ విధంగా బలవంతంగా ముఖ్యమంత్రి కుర్చీలోకి ఉధ్ధవ్ ఎక్కబోతున్నారు. ఇక ఆయనకు పాలనలో అనుభవం లేకపోవడం కూటమిని నడిపించేవారికి పెద్ద అవకాశంగా మారుతోంది.

 

అక్కడ ఉన్నది మరాఠాయోధుడు శరద్ పవార్. ఆయన ఆశీర్వాదం లేకుండా సర్కార్ అడుగు ముందుకు కదలదు. ఇక మరో వైపు కాంగ్రెస్ నుంచి ఉద్ధండులు ఉన్నారు. వారు సైతం ఉద్ధవ్ చెవిలో పోరుతూనే  ఉంటారు. వీరు కాకుండా డిప్యూటీ సీఎం ని ఒకరిని పెడతారు. ఆయన అనుభవం ఉన్నవాడే ఉంటాడు. ఆయన సైతం చక్రం తిప్పేస్తాడు. ఇక శివసేనలో పెద్ద గొంతు చేసుకుని కధ మొత్తం నడిపిన సంజయ్ రౌత్ ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడు. ఉద్ధవ్ ఠాక్రే కాదని అంటే తాను సీఎం కావాలనుకున్న పెద్ద మనిషి. అందువల్ల ఆయన శివసేన నుంచి చక్రం తిప్పుతారు.

 

వీరు కాకుండా అద్రుశ్య శక్తులు ఎన్నో ఉన్నాయి. ఇక హై కమాండ్ అందరికీ సోనియా గాంధీ  ఉండనే ఉంటారు. వీరు కాకుండా బీజేపీకి మద్దతు ఇచ్చి చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చిన శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ కూడా ఉన్నారు.  ఆయన అసలు కధను ఏ మలుపు తిప్పుతారో అందరికీ డౌటే. మొత్తానికి బీజేపీని పక్కన పెట్టి సర్కార్ ని ఏర్పాటు అయితే  చేస్తున్నారు అన్న మాటే కానీ పాలన ఎలా సాగిస్తారో చూడాలి. కొసమెరుపు ఏంటంటే మోడీని, అమిత్ షాని కాదని పీఠమెక్కిన ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ పెద్దల డేగ కన్ను ఎపుడూ ఉంటుంది. సో  ఉద్ధవ్ ముఖ్యమంత్రి అవుతున్నారా. రాజకీయ చదరంగంలో పావుగా మారుతున్నారా అన్నది తొందరలోఅనే తేలిపోతొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: