చంద్రబాబు చేస్తున్న రాజకీయాల మీద వైసీపీ ఎమ్యెల్యేలు ఒక్కొక్కరిగా విరుచుకుపడుతున్నారు. తాజాగా వైసీపీ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబు మీద విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు కడప పర్యటనకి వచ్చిన నేపథ్యంలో అయన పై ప్రభుత్వ చీఫ్ విప్..ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనకి ఏ మొఖం పెట్టుకొని వచ్చారంటూ మండిపడ్డారు. ప్రతి సారి కడప రౌడీలు రాయలసీమ రౌడీలు పులివెందుల పంచాయితీలు అంటూ  రాయలసీమ ప్రజలను తీవ్రంగా  అవమానించిన చంద్రబాబు ఏ విధంగా కడప జిల్లాలో అడుగుపెడతావు అని ప్రజలు అంతలా ఛీ కొట్టిన సిగ్గురాలేదా కడప కి ఏమి చేసావని మళ్లీ కడపలో అడుపెట్టావ్ అంటూ మండిపడ్డారు. అలాగే కడపలో బాబు కి స్వాగతం పలికిన టీడీపీ నేతలపై కూడా సంచలన కామెంట్స్  చేసారు. అలాగే ముందు కడప జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాక కడపలో అడుగుపెట్టాలి అంటూ డిమాండ్ చేసారు.



చంద్రబాబు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా .. సిగ్గులేకుండా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు జమిలీ ఎన్నికలు వస్తాయని మళ్లీ మాయ మాటలు చెపుతున్నాడు అని మొన్నటి ఎన్నికలలో కనీసం 23 సీట్లు అయినా వచ్చాయి. ఇక ఈసారి ఎన్నికలు వస్తే ..ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేదు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే బాబు ఎప్పుడు మాతో పెట్టుకుంటే మటాష్ అని అంటారని గతంలో  మాతో పెట్టుకుంటే మాటాష్ అయిపోతారని రాజశేఖర్ రెడ్డిని అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకే ఆయన ప్రమాదంలో చనిపోయారు అని  చంద్రబాబు మాటాష్ అంటున్న వ్యాఖ్యలు పై విచారణ జరిపించాలి అని కోరారు.



చంద్రబాబును వైసీపీ నేతలు తమ మాటల దాడితో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని చెప్పాలి. ఇక సీఎం జగన్ ని ప్రతి వారం కోర్టుకి పోతున్నాడు అని హేళన చేస్తున్నారని అయన ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ..నిర్భయంగా కోర్టుకి హాజరవుతున్నారని కానీ నువ్వు  కోర్టు నుంచి 26 స్టేలు  తెచ్చుకొని తనను ఎవరూ ఏమీ చేయలేరని ప్రగల్భాలు  పలుకుతున్నారని వైస్సార్సీపీ ఎమ్మెల్యేలను పట్టుకొని ఆంబోతు అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు అని వ్యవస్థలను నాశనం చేసిన చంద్రబాబే ఆంబోతులా వ్యవహారిస్తున్నారు అంటూ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: