ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ చిన్నచూపు చూసిన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో... తన అద్భుత ప్రయోగాలతో ప్రపంచ దేశాలన్నింటిలో ఔరా అనిపిస్తుంది. ఎన్నో వినూత్న అద్భుత ప్రయోగాలను నింగిలోకి పంపుతూ ప్రపంచ దేశాల చూపును తనవైపు తిప్పుకుంది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో. తాజాగా చంద్రయాన్-2 నింగిలోకి పంపింది కానీ... ఎన్నో అంచనాలతో మరెఎన్నో ఆశలతో ఇంకా ఎంతో శ్రమతో కూడుకుని నింగిలోకి ఎగిరిన చంద్రయా 2 ఒక్క అడుగు దూరంలో భారత ఆశలన్ని నిరాశపరిచింది. దీనికోసం అగ్రరాజ్యమైన అమెరికా సాయం చేసినప్పటికీ కూడా చంద్రయాన్ 2 ఆచూకీ మాత్రం లభించలేదు. కొన్ని రోజుల్లో చంద్రయాన్ 3కి సిద్ధమవుతామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు ... చంద్రయాన్ 2 అడుగు దూరంలో ఆగింది అంటే అది ఇస్రో  మొదటి విజయమని జగన్ తెలిపారు. 

 

 

 

 తాజాగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘనత సిద్ధమైంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి 47 ప్రయోగానికి సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి మంగళవారం ఉదయం 7.28 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 9.58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి47 ప్రయోగించింది  ఇస్రో. ఈ రాకెట్ ద్వారా కార్పొషాట్  3 సహా 13 అమెరికా ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపనున్నారు. ఈ సాటిలైట్ ను  నింగిలోకి పంపడం ద్వారా ఇస్రో మరో ఘనతను సొంతం చేసుకోనుంది . 

 

 

 

 26:50 నిమిషాల వ్యవధిలో ఈ 14 ఉపగ్రహాలు సాటిలైట్ రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. చంద్రయాన్-2 విఫలం తర్వాత ఇస్రో మొదటి ప్రయోగం కావడంతో దీనిపై భారీగానే ఆశలు పెట్టుకుంది ఇస్రో . ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ నిన్న సూళ్లూరుపేటలో చెంగాళమ్మ  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల వారిని కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఇస్రో చైర్మన్ శివన్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఇస్రో చైర్మన్ శివన్ గతంలో ప్రయోగించిన చంద్రయాన్-1  ప్రయోగంలో విక్రమ్ లాండర్ విఫలమైనప్పటికీ ఆర్బిటర్ మాత్రం బాగా పనిచేస్తుందని తెలిపారు. భూమికి  సంబంధించిన చిత్రాలను పంపుతోంది అంటూ ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: