ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు గురించి మాట్లాడుతూ అనకూడని మాటను అనేశాడు. దీంతో ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సీఎం జగన్ తిరుమల ఆలయం ప్రవేశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు... ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ.. " జగన్ ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టి పెరిగాడు. ఆయన గర్వించదగ్గ భారతీయు పౌరుడు." అని అన్నాడు. తర్వాత సోనియా గాంధీ గురించి మాట్లాడుతూ ఆమె విదేశీయురాలు, ఆమెకు ద్వంద పౌరసత్వాలు ఉన్నాయంటూ ఆమెను విమర్శించాడు.


తర్వాత "గతంలో చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ తో చేతులు కలిపి రాజకీయ లం*త్వానికి పాలు పడలేదా. వాళ్ల మాట్లాడుతారు జగన్ మోహన్ రెడ్డి గురించి.... అర్ధంలేని మాటలు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు " అంటూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడేశాడు. ఇంకా మాట్లాడుతూ జగన్ కి సోనియా గాంధీకి చాలా వ్యత్యాసం ఉంది అంటూ సోనియాగాంధీపై విమర్శలను చేసాడు.

దీంతో టిడిపి నేతలు.. తమ్మినేని సీతారాం చేసిన అసభ్యకర వాఖ్యలపై మండిపడుతున్నారు. రాజ్యాంగ పరమైన, బాధ్యతాయుత పదవిలో ఉండి ఇలా మహిళల గురించి బూతులు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని టిడిపి నేతలు తీవ్రంగా తమ్మినేని సీతారాం వాక్యాలను ఖండిస్తున్నారు. సిగ్గు లజ్జా లేకుండా మాట్లాడుతున్నాడు స్పీకర్ తమ్మినేని సీతారాం.. అతని కంటే రాజకీయ వ్యభిచారి ఎవరూ లేరు అంటూ... తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా తమ్మినేని సీతారాం మాట్లాడిన బూతు పై తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ్మినేని సోనియా గాంధీ గురించి అసభ్యంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై విజయవాడ పోలీస్ కమిషనర్ తిరుమలరావుకు ఆమె ఫిర్యాదు చేశారు.  జగన్మోహన్ రెడ్డి... స్పీకర్ తమ్మినేని సీతారాంను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ పద్మశ్రీ డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: