ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే . రాష్ట్రంలోని పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ధ్యేయంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతి పేద కుటుంబం తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు చేయుతగ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతియేటా పేద కుటుంబాల్లోని విద్యార్థులు చదువుకునేందుకు 15వేల రూపాయల చేయూతను అందిస్తున్నారు. ఇక అంతే కాకుండా రాష్ట్రంలోని పేద విద్యార్థులు అందరూ తెలుగు మీడియంలో చదివి ఉద్యోగాలు దొరకక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 

 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం ద్వారా... పేద విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధి చెందుతుందని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అయితే జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మరోసారి ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టాలన్న సర్కార్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఆర్ నారాయణ మూర్తి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆర్ నారాయణ మూర్తి.... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న సీఎం జగన్  నిర్ణయానికి హాట్స్ ఆప్ అంటూ  ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా జగన్ నిర్ణయాన్ని  విమర్శిస్తున్న విపక్ష పార్టీలపై  కూడా విమర్శలు చేసారు ఆర్ నారాయణ మూర్తి. 

 

 

 

 తెలుగు భాషను కాపాడాలనుకున్న వారు... మాతృభాషలో విద్యాబోధన జరగాలని చెబుతున్నా వాళ్లు తమ పిల్లల్ని మాత్రం కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు అంటూ విమర్శించారు. తమ తరంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వారు ఇప్పుడు కలెక్టరు గా పని చేస్తున్నారని ... తెలుగు మీడియంలో చదివిన  బడుగు బలహీన వర్గాల పిల్లలు బంట్రోతుల్లా  అవుతారు అని అభిప్రాయపడ్డారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై  ప్రతిపక్షాలు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నాయి.  రాష్ట్రంలో తెలుగు భాషను నిర్వీర్యం  చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకోవచ్చునదని  విమర్శలు గుప్పిస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: