ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ ఆడవాళ్లపై వివాదాస్పద వాక్యాలను చేశాడు. మహిళలపై అత్యాచారాలు..ఇంకా లైంగిక వేధింపులు జరగడానికి.. వారే కారణమంటూ 'కరుత్తుగలై పుది ఉసెయ్’ సినిమా ఆడియో విడుదల సందర్బంగా వాక్యాలు చేశాడు. ఈ రోజుల్లో మహిళలు ఫోన్ లను బాగా వాడుతున్నారు. మొబైల్స్ లో రెండు సిమ్ములు వేసి పొద్దస్తమానం ఫోన్ లోనే ఉంటున్నారు. అందుకే వారిపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు అధికమవుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

అంతటితో ఆగలేదు ఈ పెద్దమనిషి.. కొన్ని నెలల క్రితం కోయంబత్తూరులోని పొల్లాచ్చి లో జరిగిన అత్యాచారాలపై కూడా భాగ్యరాజ్ వివాదాస్పద వాక్యాలను చేశాడు. ఆయన మాట్లాడుతూ.." పొల్లాచ్చి ఘటనలో మగవాళ్ళ తప్పేమీ లేదు. అక్కడ అమ్మాయి అవకాశం ఇచ్చింది కాబట్టే అత్యాచారం జరిగింది. ఈ విషయాన్ని చెప్పడానికి నాకు బాధగా ఉన్నా చెప్పాల్సి వస్తుంది. మహిళలు చనువిస్తేనే కదా! ఎటువంటి రేపైనా, వేధింపులైన జరిగేది. ఈ మధ్యకాలంలో మహిళలు అసలు కట్టుబాట్లలో ఉండట్లేదు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ తమ భర్తలను, కన్న బిడ్డలను కూడా చంపి వార్తల్లో నిలుస్తున్నారు. కానీ మగవాళ్లు మాత్రం రెండు మూడు వివాహాలు చేసుకున్న ఎటువంటి నేరం చేయకుండా వారి భార్య బిడ్డలను మంచిగా చూసుకుంటున్నారు." అంటూ వ్యాఖ్యలను చేశాడు.

దీంతో ప్రముఖ నటీనటులు, మహిళా సంఘాలు... 'అంటే.. మగవాళ్ళు రేప్ చేస్తే తప్పేం లేదు అంటారా?' అని అతనిపై త్రీవంగా మండిపడుతున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా తనదైన శైలిలో భాగ్యరాజ్ అత్యాచారాలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.


చిన్మయి ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించారు... "అత్యాచారాలు జరిగితే మహిళలను నిందించవద్దని ప్రముఖులకు చెప్పి చెప్పి నేను అలసిపోయాను. నిజానికి ఇటువంటి వ్యాఖ్యలను చేసే భాగ్యరాజ్, ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు వలనే అమ్మాయిలు చనిపోతున్నారు." అంటూ మండిపడింది.




మరింత సమాచారం తెలుసుకోండి: