సమాజాన్ని చీడలా పట్టి పీడిస్తున్న మహా భూతం ఫోర్నోగ్రఫీ. మనుషులకు ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాక అతని పోకడ కూడా వింత వింత ధోరణికి అలవాటుపడుతుంది. ఆ అలవాటే చాటుమాటుగా తప్పులు చేసేలా ప్రోత్సహిస్తుంది. ఆతప్పులే అడ్డదారుల్లో నడవడానికి దారులను ఏర్పరస్తుంది. దీని బారిన పడిన మనిషి ఉగ్రవాదికంటే తీవ్రమైన ఆలోచనలతో విచక్షణకోల్పోయి మృగంలా మారుతున్నాడు. అడవిలో ఆకలితో ఉన్న పులి లేడిని ఎలా వెంటాడుతుందో అలా ఆడదానికోసం ఆవురావురు మంటూ మాటువేస్తున్నాడు. అదను చూసి తన ఆకలి తీర్చుకుంటున్నాడు. క్షణికమైన సుఖం కోసం కక్షకడుతున్నాడు.

 

 

ఇంద్రియలోలుడై తన మనసును ఆజ్ఞలో ఉంచుకోకుండా  చెట్టు మీది కోతివలే  గెంతుతున్నాడు. నాలుగు గోడల మద్య రహస్యంగా కావించుకునే కార్యాన్ని నలుగురి మధ్య ఒకరితో కాకుండా విచ్చలవిడిగా చేస్తున్నాడు. వాస్తవంలో అసలు ఏం జరుగుతుంది? యౌవనంలో వున్నప్పుడు శరీర సంబంధమైన, సెక్స్ వాంఛ చాలా తీవ్రంగా వుంటుంది. దీనికి హద్దులు ఏర్పరచడం కోసం వివాహం అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇరు పక్షాలలోను యీ శరీర సంబంధమైన వాంఛ వుంటుంది. అందువల్లనే మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పిల్లల్ని కంటున్నారు.

 

 

ఒక పురుషుడికో, ఒక స్త్రీకో జీవిత పర్యంతం మిమ్మల్ని మీరు కట్టి వేసుకుంటుంటారు. ఈ విధంగా సుఖాన్ని అందించడానికి ఒక శాశ్వతమైన ఏర్పాటూ,  సమాజం ఏర్పరచింది. కాని మనుషులు అదికమైన ఉద్రేకాలకు లోనై తాను మనిషి అన్న ఆలోచనే లేకుండా సద్వినియోగించుకోవలసిన టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నాడు.

 

 

జీవితాల్లో సెక్స్ కు యింత ప్రాధాన్యతనిస్తూ అది లేకుండా బ్రతకలేని స్దితికి దిగజారాడు. ఇదొక సమస్యగా తయారు చేసుకుని తనని తాను నీచుడిగా లోకానికి పరిచయం చేసుకుంటున్నాడు. ఇప్పుడున్న సెల్ ఫోన్లు ఇంకా ఈ విచ్చలవిడితనానికి బానిసను చేస్తున్నాయి. ఇంటర్ నెట్ సదుపాయం అనేది మనిషిని నాశనం చేస్తుంది అనడానికి ఇంతకంటే ఉదహరణ ఏది ఉండదు. ఫోర్నోగ్రఫీ అనే మత్తుకు బానిసలా మారి దీన్నే జీవితం అనే భ్రమలో బ్రతుకుతున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: