ఇటీవలే కాలంలో సమాజంలో అత్యాచారాల పర్వం చాలా ఎక్కువైపోతుంది. పసికందు నుండి వృద్ధురాలు వరుకు ఎవరిని బయటకు పంపాలన్న కళ్ళల్లో కన్నీరు వచ్చేలా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసిన కళ్ళ నిండా కామం పెట్టుకున్న కామాంధులే కనిపిస్తున్నారు..  మాటలతో, చేతలతో, చూపులతో ఆడదాని అణువణువు తడిమేస్తున్నారు. వారికి వాళ్లను కన్న తల్లి, తోడపుట్టిన చెళ్లి గుర్తుకు రాదేమో. అసలు ఆడపిల్లలను ఆటబొమ్మలుగా చూసే వారి కళ్లకు ఇవన్ని ఏం గుర్తుకు వస్తాయి. 

 

ఇలా ఘోర సంఘటనలను చూస్తున్న కన్న వారికి ప్రేమగా పెంచుకున్న బిడ్డ కాస్త కామాంధుల చేతిలో నలిగిపోతే ఏడవక ఎం చేస్తారు ? అసలు యువత ఇలా అవ్వడానికి కారణం ఏంటి ? అటుపక్క ఉన్నదీ పసి పాప, యువత, వయో వృద్ధురాలా అని కూడా చూడకుండా ఎందుకు ఇంత నీచానికి దిగజారుతున్న ? ఇలా అవ్వడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారా ? ఇంకా తెలియడం లేదా ఇలా అత్యాచారాలు ఎక్కువగా జరగటానికి పోర్నోగ్రఫీ కారణం. మనిషి మనసులోని ఆలోచనలు నియంత్రణ కోల్పోయేలా చేసేది ఈ మమ్మారే. 

 

సమాజంలో రోజు రోజుకు క్యాన్సర్ లా పెరిగిపోతున్న పోర్నోగ్రఫీ ఇప్పుడు యువతను శాసించే స్దాయికి వెళ్లింది. ఈ గలీజ్ పోర్న్ వల్ల 13 ఏళ్ళ పిల్లాడి నుండి వయో వృద్ధుడి వరుకు అసహ్యమైన ఆశలు పుట్టి అమ్మాయిలపై అత్యాచారాలు చేసేలా ప్రేరేపిస్తుంది. ఎంతోమంది మహిళలు ఈ పోర్నోగ్రఫీ ఆపడానికి ప్రయత్నించినా సరే ఆగటం లేదు ఎందుకు ? దీని వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి అని తెలిసిన సరే ప్రభుత్వం సైతం ఈ పోర్నోగ్రఫీని నిషేదించ లేకపోతుంది. 

 

కరుడుగట్టిన పోర్నోగ్రఫీ తన జడలు విప్పుకుని కోరికల కత్తులు పట్టుకుని సమాజంలో ఉన్న మంచి ఆలోచనల గుత్తులను తెగనరుకుతూ మానవతా విలువలను బజారుకీడుస్తుంటే వారి కబంద హస్తాల్లో చిక్కుకుని బలవుతున్న స్త్రీలకు రక్షణ కరువైయ్యిందని తెలియకనే తెలుస్తుంది. ఇప్పటికైనా ఈ విషయంలో మేలుకోకుంటే తగిన విధంగా చర్యలు తీసుకోకుంటే సమాజంలో మనుషులు మిగలరు. మనిషి అని చెప్పబడే మృగాలు మాత్రమే కనిపిస్తాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: