చంద్రబాబునాయుడు రాక కోసం రాజధాని ప్రాంతంలోని దళిత రైతులు రెడీ అవుతున్నారు. నిరసనలతో స్వాగతం చెప్పటానికి రంగం రెడీ చేసుకున్నారు. రాజధాని ప్రాంతంలోని రైతులంటే ముఖ్యంగా 29 గ్రామాల రైతులనే చెప్పుకోవాలి. గురువారం నాడు అమరావతి ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించటానికి చంద్రబాబు పర్యటించబోతున్నారు.

 

నిజానికి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటించటానికి ప్రత్యేకంగా అక్కడేమీలేదనే చెప్పాలి. తన హయాంలో జరిగిన తాత్కాలిక నాసిరకం నిర్మాణాలు తప్ప. ఈ విషయం తెలిసినా చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారంటే జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే ధ్యేయంగా పెట్టుకున్నారని తెలిసిపోతోంది.   దాంతో చంద్రబాబు వ్యతిరేక వర్గం కూడా యాక్టివ్ అయ్యింది.

 

రెండు రోజులుగా చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలతో దళిత రైతులంటూ కొందరు రైతులు, స్ధానికులు రెచ్చిపోతున్నారు. రైతులు, స్ధానికుల ముసుగులో టిడిపి జగన్ కు వ్యతిరేకంగా ఎలా ఆరోపణలు చేయిస్తోందో ఇపుడు చంద్రబాబు మీద కూడా మరికొందరు రైతులు ఆరోపణలకు దిగారు. జగన్ పై చంద్రబాబు చేస్తున్నది బురద రాజకీయమైతే చంద్రబాబుపైన కూడా అదే పద్దతిలో వైసిపి చేయిస్తోందనే అనుకోవాలి.

 

ఐదేళ్ళల్లో ఒక్క శాస్వత భవనం కూడా కట్టలేని తన చేతకానితనాన్ని చంద్రబాబు ఒప్పుకోవటం లేదు. పైగా అమరావతి స్పూర్తిని జగన్ చంపేశాడని ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తు, ఎల్లోమీడియాలో కథనాలు రాయిస్తున్నారు. దాంతో జగన్ కు కూడా మండిపోతోంది. నిజానికి తన హయాంలో చంద్రబాబే తాను అనుకున్నట్లుగా శాస్వత భవనాలు కట్టేసుంటే రాజధాని విషయంలో కొత్తగా ఇపుడు నిర్ణయం తీసుకోవటానికి జగన్ కు అవకాశమే ఉండేది కాదు.

 

తన చేతిలో ఉన్న అవకాశాన్ని చేజేతులారా వదిలేసుకుని ఇపుడు జగన్ పై ఆరోపణలు చేస్తుండటమే విచిత్రంగా ఉంది. అందుకనే చంద్రబాబు వ్యతిరేక వర్గాన్ని వైసిపి యాక్టివేట్ చేసింది. దాంతో గురువారం చంద్రబాబు పర్యటనలో అమరావతి ప్రాంతంలో ఎటువంటి గొడవలు జరుగుతాయో అనే టెన్షన్ మొదలైంది. ఎందుకంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు దళిత రైతులు రెడీ అయిపోయారు. మొత్తానికి ఏదో రచ్చ చేస్తు జగన్ పై బురద చల్లటమే చంద్రబాబు టార్గెట్ గా కనబడుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: