పవన్ కళ్యాణ్ ప్రముఖ  సినిమా నటుడు. ఆయనకు హిట్లు అక్కడ ఉన్నాయి. సూపర్ స్టార్ డం కూడా ఉంది. ఆయన సినిమాలు చేస్తే చూడాలనుకునే ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాలు తీస్తామని వెంటపడుతున్న నిర్మాతలు కూడా ఉన్నారు. ఇక కళ్ళు చెదిరే పారితోషికం కూడా ఇస్తామని భారీ ఆఫర్లు ఇస్తున్న వారూ ఉన్నారు. మరి  పవన్ రెండేళ్ళు అయింది ముఖానికి రంగు పూసుకుని అదిగో ఇదిగో అంటూ 2019 కూడా వెళ్ళిపోతోంది. మరి పవన్ సినిమా చేస్తారా..చేస్తే ఎపుడ‌ది..

 

నిజానికి పవన్ సినిమాలు చేస్తేనే బాగుంటుందని ఆయన‌ శ్రేయోభిలాషులు  కూడా  అంటున్నారని టాక్. ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. మళ్ళీ నాలుగున్నరేళ్ళ వరకూ ఇక్కడ పని లేదు. పవన్ ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి ఆయనకు అసెంబ్లీ  సమావేశాలు వంటి పేచీ పూచీలు లేవు. ఆయన సినిమాలు చేసుకుంటూ వీలున్నపుడు రాజకీయ టూర్లు వేసినా ఎవరికీ అభ్యరంతరం కూడా లేదు. కానీ పవన్ ఇపుడు అసలు సిసలు ప్రతిపక్ష నాయకుడిగా మారిపోయి ఏపీలో రాజకీయం చేస్తున్నారు.

 

తన విలువైన సమయాన్ని కూడా పూర్తిగా రాజకీయాలకే అంకితం చేస్తున్నారు. విశాఖ లాంగ్ మార్చ్ తరువాత విజయవాడ మీటింగులు పెట్టారు. హైదరాబాద్ లో పార్టీ నేతలతో  మీటింగులు పెట్టారు, ఇపుడు రాయలసీమ టూర్లు అంటున్నారు. పవన్ ఇలా ఫుల్ టైం రాజకీయాలకు సిధ్ధపడడానికి కారణం ఏంటి, ఎవరు అంటే జగన్ అన్న సమాధానం వస్తుంది.

 

అదెలా అంటే అవును నిజమే జగన్ పవన్ ఇగోను అడుగడుగునా దెబ్బ తీస్తున్నారు అన్న సమాధానం కూడా వస్తుంది. పవన్ని జగన్ ఎపుడూ రాజకీయ నాయకుడిగా చూడలేదట.  ఆయన్ని యాక్టర్ అంటూ వచ్చారట. పవన్ మళ్ళీ ముఖానికి రంగు పూసుకుంటే యాక్టర్ పేరు ప‌ర్మనెంట్ అయిపోతుంది. అందుకే పవన్ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారని అంటున్నారు. 

 

తాను రాజకీయాలు వదిలేశానని కూడా ప్రచారం చేస్తారన్న అనుమానంతో కూడా పవన్ పార్టీ ఆఫీసులోనే మీటింగులు అంటున్నారు. షూటింగులకు స్వస్తి చెప్పేస్తున్నారు. అయితే ఇక్కడే పవన్ పప్పులో కాలేస్తున్నారని అన్న వారూ ఉన్నారు. బాలక్రిష్ణ ఎమ్మెల్యే అయినా  కూడా ఆయన ఎపుడూ సినిమాలు వదలలేదు. మరి పవన్ ఎందుకు వదలాలి అంటున్న వారు ఉన్నారు. కానీ పవన్ మాత్రం రాజకీయమే అంటూ రెడీ అయిపోతున్నారు. మరి పవన్ ఎపుడు షూటింగ్ అంటారా అని నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: