ముఖ్యమంత్రి జగన్ ఆరు నెలల కాలంలో అమరావతినే అట్టిపెట్టుకుని ఉన్నారు. ఆయన అవసరం పడితే ఢిల్లీ వెళ్తున్నారు. లేకపోతే లేదు, మధ్యలో ఒకసారి జిల్లాలలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రారభోత్సవాలకు కూడా  వెళ్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ ఎన్నడూ లేని విధంగా ఒకే చోటకు మూడు సార్లు వెళ్తున్నారు. అదీ ఒకే నెలలో వెళ్తున్నారు. దానికి కారణమేంటి..

 

విశాఖ జిల్లాకు జగన్ డిసెంబర్ నెలలో మూడు సార్లు వస్తున్నారు. మూడు కూడా మూడు ప్రత్యేక సందర్భాలు.  జగన్ డిసెంబర్ 4న జరిగే నేవీ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. ప్రతీ  ఏటా నేవీ డేని నేవీ తూర్పు నావికాదళం నిర్వహిస్తుంది. ఈసారి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి  జగన్ ని పిలిచారు. ఈ హోదాలో జగన్ కూడా ఫస్ట్ టైం నేవీ ప్రొగ్రాం లో పాలుపంచుకోవడం.

 

ఇక ఇదే నెల అంటే డిసెంబర్లో 10వ ఆంధ్రా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధుల సమావేశం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ళుగా భారీ ఆర్భాటంగా జరుగుతున్నా ఈ కార్యక్రమానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, వెంకయ్యనాయుడు లాంటి వారు వచ్చారు. దేశ విదేశాల నుంచి ఎంతో మంది పూర్వ విద్యార్ధులు ప్రముఖ స్థానంలో ఉన్న వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దానికి ముఖ్య అథిధిగా జగన్ హాజ‌రవుతారని అంటున్నారు.

 

ఇక  డిసెంబర్ 27, 28 తేదీలో విశాఖ ఉత్సవ్ ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇది కూడా రెండు దశాబ్దాలుగా జరుగుతున్న పెద్ద ఈవెంట్. దీనికి కూడా జగన్ హాజరవుతారని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. టూరిజం పరంగా విశాఖను డెవెలప్ చేయాలన్న ఉద్దేశ్యంలోనే ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. జగన్ రావడం ద్వారా విశాఖ టూరిజానికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి జగన్ మూడు సార్లు డిసెంబర్ నెలలోనే విశాఖ రావడం అంటే అరుదైన విషయం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: