తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలు పరిశీలించేందుకు చంద్రబాబు నాయుడు బయల్దేరాడు. అయితే ఆలా బయల్దేరిన చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది.  

 

40 ఏళ్ళ చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబుకు 70 ఏళ్ళ వయసులో ఘోరాతి ఘోరమైన అవమానం జరిగింది. ఇన్నేళ్ళలో జరగని అవమానం ఈరోజు జరిగింది. 2019 ఎన్నికల్లో అతి ఘోరంగా ఓడిపోయి ఘోర అవమానాన్ని చవి చుసిన చంద్రబాబు ఇప్పుడు మరో అవమానంపాలయ్యాడు. అసలు విషయానికి వస్తే.. చంద్రబాబు అమరావతిలోకి వచ్చే ప్రసక్తి లేదని ఇప్పటికే కొందరు రైతులు హెచ్చరించారు.     

 

రాజధాని కోసం తమవద్ద భూములు తీసుకొని ప్లాట్లు ఇవ్వలేదని, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటివి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దళిత రైతుల పట్ల పూర్తి నిరంకుశ వైఖరి కనబరచారని బాధపడ్డారు. బాబు పర్యటనకు వ్యతిరేకంగా నల్ల జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారని రైతులు చెప్పారు. 

 

దీంతో అమరావతిలో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడింది. దీంతో అక్కడ 'గో బ్యాక్ చంద్రబాబు' అంటూ రైతులు నినాదాలు చేస్తున్నారు. ఈ నినాదాలను కొందరు టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకించి వారు కొట్టుకున్నారు. దీంతో అక్కడే ఉన్న రైతులు చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో దాడి చేశారు. అటు టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో వెంకటపాలెం ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఏది ఏమైనా 40 ఏళ్ళ చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది అనే చెప్పాలి. చంద్రబాబు ఈ అవమానంతో ఎం చేసుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: