మొదటినుండి కమ్మ రాజ్యం లో కడప రెడ్లు సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా ఉండబోతుంది అనుకున్నారు కానీ ఇది రెండు కులాలమధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణానికి నిదర్శనమని కొందరు కానీ రాంగోపాల్ వర్మ ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల గురించి వైస్సార్ కాంగ్రెస్ మరియు టీడీపీ పార్టీల మధ్య కొనసాగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కథ సన్నివేశాలు ఉంటాయని వెల్లడించాడు. కానీ ఈ సినిమాలో అందరు ప్రముఖులను చూపించడం  ట్రైలర్స్ చుస్తే మనం గమనించవచ్చు. పవన్ కళ్యాణ్ , కె ఏ పాల్ , నారా లోకేష్ , జగన్ మోహన్ రెడ్డి, ఎన్టీఆర్ తదితరుల పాత్రలు మనకు కనిపిస్తాయి. ఒకరు వర్మ ని జనసేనను కూడా వాడుకున్నారు కదా అని పవన్ కళ్యాణ్ అతడు చేసిన ఎన్నికల ప్రచార సన్నివేశాలు హావభావాలు చాల బాగా చూపించారు అని అడగ్గా అది జనసేన కాదు అని మనసేన అని బదులిచ్చాడు దీనికి అందరు నవ్వారు.  ఇందులోభాగంగా గతంలో ఏపీ లో   చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వర్మ   తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను నిలిపివేయడానికి ప్రయత్నించిందని వర్మ ఆరోపించడమే కాకుండా ఆ సన్నివేశాన్ని కూడా ఇందులో పొందుపర్చడం చర్చనీయాంశం.  అలాగే ఆ చిత్రాన్ని ఏపీలో అప్పట్లో విడుదలను నిలిపివేసిన  అప్పటి ప్రభుత్వం  ఈ సినిమాలో అప్పటి ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తారని తెలుస్తోంది. తన సినిమా విషయంలో మాజీ సీఎం చేసిన పనులను ఇందులో చూపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇక కె ఏ పాల్ పైన ఏకంగా ఒక పాటను చిత్రీకరించడం అందరిని నవ్వించింది అతడి వేషధారణ, హావభావాలు, ఎన్నికల ప్రచారం కలిపి పాటను చిత్రీకరించడం కథకు సరిగ్గా సరిపోయంది అని వివరించాడు వర్మ నవ్వుతు . దీనిపైనా కె ఏ పాల్ ఫైర్ అయ్యారు ఆవేశంగా స్పందించారు. దానికి వర్మ బదులుగా ప్రపంచ దేశాల శాంతి ని కాపాడండి అని ప్రపంచయుద్ధాలను ఆపండి అని వ్యంగంగా బదులిచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: