2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారి రాష్ట్ర రాజధాని అమరావతిలో పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో  టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలు ఎంతవరకు పూర్తయ్యాయని సమీక్షించడం సహా రైతులు టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో అమరావతి రైతులందరూ గోబ్యాక్ చంద్రబాబు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అమరావతి టూర్ కు బయల్దేరిన చంద్రబాబు అడుగడుగున నిరసన జ్వాలలు తగులుతున్నాయి. అయితే పర్యటన ప్రారంభంలోనే చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు కర్రలు విసిరి నిరసన వ్యక్తం చేసారు  రైతులు. 

 


 చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. అంతేకాకుండా చంద్రబాబు గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీ  లు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మొదటిసారి అమరావతి లో పర్యటించిన చంద్రబాబుకు అడుగడుగునా నిరసనలు తగులుతున్నాయి. ఏ ముఖం పెట్టుకొని మరోసారి అమరావతి లోకి వస్తున్నారు  అంటూ చంద్రబాబు అని ప్రశ్నిస్తున్నారు. అటు అధికార పక్షం కూడా చంద్రబాబు అమరావతి పర్యటన పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే బూటకపు హామీలతో రైతులను మోసం చేసిన చంద్రబాబు మరోసారి అమరావతి రైతుల పై కపట ప్రేమ చూపించేందుకు పర్యటన చేస్తున్నారన్న విమర్శలు చేస్తున్నారు. 

 

 అమరావతిలో చంద్రబాబు పర్యటన ఒక హైడ్రామా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అమరావతి రైతులకు తాము న్యాయం చేసామని చెప్పుకుంటున్న చంద్రబాబుకు అమరావతి పర్యటనలో అడుగడుగునా నిరసనలు ఎందుకు తగులుతున్నాయి అంటూ ప్రశ్నిస్తున్నారు అధికార పక్ష నేతలు . అయితే మరోసారి మాయ మాటలతో ప్రజలను నమ్మించేందుకు బాబు   అమరావతి పర్యటన చేస్తున్నారని కానీ చంద్రబాబు యవ్వారం గురించి అమరావతి రైతులు ప్రజలందరికీ పూర్తిగా అర్థమైందని అధికార పక్ష నేతలు అంటున్నారు. చంద్రబాబు చెప్పే మాటలను అమరావతి రైతులు ఎవరు నమ్మబోరని హితవు పలుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: