చంద్రబాబు నాయుడు మాటకు వస్తే చాలు అమరావతి రాజధాని అంటారు. తన కలల స్వప్నం అంటారు. అమరావతి రాజధానిని  వైసీపీ పాలకులు చిదిమేశారని కూడా గగ్గోలు పెడతారు. అటువంటి బాబుకు అమరావతి ఇపుడు కళ్ళ ముందే జారిపోయింది. అమరావతి విషయంలో తాను ఊహించిన  దానికి భిన్నంగా వాతావరణం కనిపిస్తే పాపం ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ బెంబేలెత్తిపోదా.

 

అమరావతి నుంచి చంద్రబాబునే గో బ్యాక్ అన్న తరువాత పెద్దాయనకు పరువు పోయినట్లైంది. రైతుల నుంచి సేకరించిన భూములను అడ్డగోలుగా  తన అస్మదీయులకు బాబు కట్టబెట్టడంపైన కూడా రైతాంగం కన్నెర్ర చేసింది.  అమరావతి గ్రాఫిక్స్ చూపించారు గానీ ప్లాట్స్ ఇచ్చారా అని రైతులు ఆగ్రహిస్తే బాబోరుకు మతి పోయిందిగా.

 


రాజధాని కోసం నమ్మి భూములిచ్చిన రైతులకు ఏమిచేశారో చెప్పండని నిగ్గైదీస్తే బాబు ఏం జవాబు చెప్పగలరు పాపం.  ప్రైవేటు వ్యక్తులకు ఇష్టం వచ్చిన రేట్లతో .రైతుల భూములను దోచిపెట్టారంటూ రైతులు గట్టిగా తగులుకున్నాక బాబుకు నోటి మాట రాలేదట. ఇక  కౌలురైతులకు, చేతి వృత్తి దారులకు రాజధానిపేరుతో బాబు చేసిన అన్యాయాన్ని చెప్పి  తన పర్యటన కొనసాగించాలని రైతులు గట్టిగానే తగులుకున్నారు.


  
అదే విధంగా  పేద రైతుల భూములు ఏ విధంగా తన మనుషులకు దోచిపెట్టాడో బాబు చెప్పి మరీ  తన పర్యటన కొనసాగించాలని రైతులు ప్ల కార్డులు ప్రదర్శిస్తే తట్టుకోగలరా. ఇక తన బినామీ కాంట్రాక్టర్లకు ఏవిధంగా... రైతుల భూములు దోచిపెట్టాడో చెప్పాలని కూడా రైతులు డిమాండ్ చేశారు.  గ్రామకంఠాలను తేల్చకుండా...సామాన్యులను సైతం ఎందుకు ఇబ్బందిపెట్టాడో చెప్పాలని వారు గట్టిగానే కోరారు. 

 

అలాగే, భూములివ్వని రైతులపై ఎందుకు కేసులు పెట్టించి, పోలీసులతో వేధింపులకు గురి చేశారని కూడా ఆరోపించారు. తన హయాంలో.. ఒక్కటికూడా.. పర్మనెంటు బిల్డింగ్ కట్టలేకపోయాడో...బాబు చెప్పాలని,  నిర్మాణవ్యయం చదరపు అడుగు సుమారు రూ.1500/- అవుతుంటే...ఇసుక,భూమి..ఉచితంగా ఇచ్చి తన బినామీ కాంట్రాక్టర్లకు, చదరపు అడుగు రూ.15,000/- లకు ఎందుకు ఇచ్చాడో.. చెప్పి,బాబు తన పర్యటన కొనసాగించాలని రైతులు నిగ్గదీస్తే బాగోరి టూర్ మొత్తం గందరగోళమైందిగా.

 


కేంద్రప్రభుత్వానికి .వారు ఇచ్చిన డబ్బుకు..రాజధానిలో ఎక్కడ, ఏ విధంగా..ఖర్చు పెట్టాడో... ఎందుకు యూటిలైజేషన్ సర్టిఫికెట్ లు ఇవ్వలేదో... చెప్పి, బాబు తన పర్యటన కొనసాగించాలని  పేద,దళిత రైతుల భూములు ఎందుకు సింగపూర్ ప్రైవేటు సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ జోక్యంఅన్నదాతలపై టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ రాజధాని ప్రాంతం రైతులు గురువారం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.  లేకుండా కట్టబెట్టాడో...చెప్పి, బాబు తన పర్యటన కొనసాగించాలని రాజధాని రైతులు గట్టిగానే అడ్డుకున్నారు. ఇక  అన్నదాతలపై టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ రాజధాని ప్రాంతం రైతులు ఈ రోజు  చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: