టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ రాజధాని అమరావతి పర్యటన ఉద్రిక్తతకు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. రాజధాని పర్యటనకు వెళ్లిన‌ చంద్రబాబు కాన్వాయ్‌ను రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అమరావతిలో పర్యటించవద్దంటూ ఫ్లకార్డులు, ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ప‌రిణామాల‌పై వైసీపీ సీనియ‌ర్ నేత, ఏపీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నీచుడు చంద్రబాబుకు చెప్పులతో స్వాగతం పలికిన రాజధాని రైతులకు ధన్యవాదాలు అంటూ ఆయ‌న క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు.

 

చంద్ర‌బాబు రైతుల భూములు లాక్కుని వాళ్ళకి నమ్మకద్రోహం చేశాడ‌ని కొడాలి నాని విరుచుకుప‌డ్డారు. ``ఐదేళ్లు గ్రాఫిక్స్‌కు ముద్దులు పెట్టి.. ఇప్పుడు రాజధాని భూమికి ముద్దు పెట్టాడు. ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కలిగినందుకు సంతోషం`` అని ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల్లో టీడీపీకి బొటాబొటీగా 23 సీట్లు ఇచ్చినా ఆయ‌న‌కు సిగ్గురాలేదని ఎద్దేవా చేశారు. ఈ రోజు ప్రజలు చెప్పులతో కొట్టినా బుద్ధి రాలేదు అంటూ విరుచుకుప‌డ్డారు. ``రాజధానిలో 33 వేల ఎకరాలు పూలింగ్‌ చేసి, ఫారెస్ట్‌ ఎండోమెంట్‌ ల్యాండ్‌ గ్రామకంఠాలు దాదాపు 60 వేల ఎకరాలు ఉంది. ఆయన ఇచ్చిన డీపీఆర్‌ ప్రకారం లక్షా 9 వేల కోట్ల రూపాయలు భూముల అభివృధ్దికి అవుతాయి. అంటే ఎకరానికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చేలా తయారుచేశారు. రేట్లు పెరిగిన కొలది కేవలం ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ క్రియేట్‌ చేయడానికి రెండు లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. మనకు అంత ఆర్దిక స్దోమత ఉందా?ఇప్పటికి ఐదువేల కోట్లు అప్పులు తీసుకువచ్చాడు. దానికి పదిన్నర శాతం వడ్డీ కట్టాల్సిన బాద్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
రెండులక్షల కోట్ల రూపాయలను అప్పుగా తెస్తే వడ్డీకి ఎంత చెల్లించాలి? రాష్ట్రం ఆదాయం ఎంత?కనీసం వడ్డీలన్నా కట్టగలమా?`` అని నిల‌దీశారు.

 

చంద్రబాబు కన్నుమిన్నూ కానరాక అమరావతిని గ్రాఫిక్స్‌ లో ఉన్న భ్రమరావతిని సృషించి ఈ రాష్ట్రం అంతా చూపి ప్రజలను మోసం చేయాలని చూపించార‌ని విరుచుకుప‌డ్డారు. ``అమరావతిని అడ్డుపెట్టుకుని రాజకీయంగా పదికాలాలపాటు బతకాలనే ప్రయత్నం చేసిన సన్నాసి చంద్రబాబు. ఇదంతా చూసిన ప్రజలు అతనిని కేవలం 23 సీట్లకు పరిమితం చేశారు. చింతసచ్చినా పులుపు చావలేదని చెబుతారు.సిగ్గుశరం లేదు.ఇంకా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న భ్రమలో ఉన్నాడు.రోజుకు ఓక ఎలిగేషన్‌ మొన్నటివరకు ఇసుక అన్నాడు అది సాల్వ్‌ అయింది. తర్వాత ఇంగ్లీషు అన్నాడు.దానిపై ప్రజలు చెప్పులతో కొట్టేపరిస్దితి వచ్చింది. దానిపై వ్యతిరేకిస్తే దానిపై యూటర్న్‌ తీసుకుని వదిలివేశాడు. ఇప్పుడు అమరావతి అన్నాడు. గట్టి గుణపాఠం చెప్పారు. చెప్పుదెబ్బలు, రాళ్లు, కర్రదెబ్బలు ఈరోజు ఇదికూడా యూటర్న్‌ తీసుకుంటాడు దానిపై కూడా ఉండడు`` అని వ్యాఖ్యానించారు. 
తాను గ్రాఫిక్స్‌లను రిలీజ్‌ చేశాను 90 శాతం రాజధాని కట్టేశాను కదా అని అంటూ మాట్లాడుతున్నార‌ని మంత్రి నాని వ్యాఖ్యానించారు. ``నీవు 90 శాతం కట్టేస్తే మేం ఈ 6 నెలల్లో మిగిలిన పదిశాతం కూడా కట్టలేదని అంటావా? ఒక మంత్రి దీనిని స్మశానం అన్నాడు అని విమర్శిస్తాడు. ఈ స్మశానంలో 151 మంది చచ్చినవారితో సమానం అని కడపవెళ్లి విమర్శలు చేస్తాడు. చంద్రబాబు సిగ్గూ సెరం లేని లుచ్చా.. ఇంక డ్రామాలు ఆపు. చంద్రబాబు ఔట్ డేటెడ్ అయిపోయాడు.. పప్పు వల్ల ఏమి కాదు.. ఇంకా సుద్ద పప్పు అవుతాడు. అమరావతి స్మశానం కాదు.. చంద్రబాబు పెద్ద శవం.. ఆయనతో  ఉన్నవాళ్లు దున్నపోతులు. 
మాకు అమరావతితో పాటు రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు ముఖ్యమే. అన్ని ప్రాంతాలనూ సీఎం జగన్ ఒకే విధంగా చూస్తున్నారు`` అని తేల్చిచెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: