చంద్రబాబునాయుడుకు అసలు సినిమా ముందుందా ? అమరావతి ప్రాంతంలోని ఉద్ధండరాయుని పాలెం గ్రామంలో జరిగిన గొడవ భవిష్యత్ దర్శనానికి సంకేతాలా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి ఐదునెలలకే చంద్రబాబు ఇన్ని డ్రామాలాడితే మరి మిగిలిన నాలుగున్నరేళ్ళలో ఏం చేస్తారు ? ఇపుడిదే అనుమానం పెరిగిపోతోంది.

 

మామూలుగా  ప్రతిపక్షంలో ఎవరున్నారా  అధికారపార్టీ పరిపాలనలో  జోక్యం చేసుకోదు. ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎన్ని తప్పులు చేసినా చూసి చూడనట్లే వెళుతుంది. ప్రతిపక్షం ఎలాగూ పట్టించుకోవటం లేదు కాబట్టే తామిష్టం వచ్చినట్లు అధికార పార్టీ చేసుకెళుతుంది. అధికారపార్టీ విచ్చలవిడితనంలో తప్పులు కూడా దొర్లుతాయి. అధికారపార్టీ తప్పులు చేయటమే ప్రతిపక్షానికి కూడా కావాల్సింది.

 

అధికార పార్టీని తప్పుల మీద తప్పులు చేయనిచ్చి ఓ ఏడాది తర్వాతో లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినపుడో గోల మొదలుపెడుతుంది. తనకున్న మీడియా బలంతో అధికారపార్టీకి వ్యతిరేకంగా రెచ్చిపోతుంది. మామూలుగా ఏ ప్రతిపక్షమైనా చేసేదిదే. కానీ అందుకు విరుద్ధంగా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు.

 

ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు అంగీకరించలేకపోతున్నారు.  మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా తాను ఓడిపోయానని చంద్రబాబు అంగీకరించలేకపోతున్నారు. చెప్పుకోవటానికే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కానీ చంద్రబాబులో ఎక్కడ లేని ఉక్రోషం కనబడిపోతోంది. అందుకనే జగన్ మీద ఇంత గోల చేసేస్తున్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబుకు అసలు సినిమా  ముందున్నట్లే ఉంది.

 

చంద్రబాబు మరచిపోయిన విషయం ఏమిటంటే గోలంతా మొదటి ఐదు నెలల్లోనే చేసేస్తే మిగిలిన నాలుగున్నరేళ్ళల్లో చేయటానికేమీ ఉండదు. ఎందుకంటే ఏరోజు ఎంతమంది ఎంఎల్ఏలు పార్టీకి రాజీనామా చేసి వెళిపోతారో తెలీదు. ఓ పదిమంది ఎంఎల్ఏలు గనుక రాజీనామా చేస్తే చాలు  చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా ఎగిరిపోతుంది. ఇకపుడు ప్రభుత్వ పరంగా ఇపుడున్న ప్రోటోకాల్ కూడా ఉండదు. కాబట్టి జగన్ పై పోరాటాన్ని పక్కనపెట్టి ముందు తన ఎంఎల్ఏలను కాపాడుకునే మార్గం చూసుకుంటే అదే పదివేలు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: