ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి.  పోలీసులు ఎన్ని భద్రత చర్యలు తీసుకుంటున్నా.. కామంధులు ఎక్కడో అక్కడ ఈ ఘాతుకాలకు పాల్పపడుతున్నారు. తాజాగా నిన్న  వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక హత్య తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది.  హైదరాబాద్ శివారు ప్రాంతంలో ప్రియాంక రెడ్డి అనే ఓ మహిళా వెటర్నరీ డాక్టర్ దారుణమైన రీతిలో హత్యకు గురైందన్న విషయం సెన్సేషన్ సృష్టించింది.

 

షాద్ నగర్ సమీపంలో ఆమె మృతదేహం దహనమైన స్థితిలో కనిపించింది. హాస్పిటల్ కు వెళ్లిన ఆమె తిరిగి వచ్చే సమయంలో స్కూటీ పాడవడంతో రోడ్డుపై నిలిచిపోయింది. ఆ సమయంలో తన చుట్టుపక్కల కొందరు లారీ డ్రైవర్లు ఉన్నారంటూ తన చెల్లికి చేసిన ఫోన్ చేసి కన్నీరు పెట్టుకుంది.  లారీలో ఉన్న వ్యక్తి స్కూటీని బాగు చేయిస్తానని తీసుకెళ్లి షాపు మూసేసి ఉందని మళ్లీ వచ్చాడని, తనకు భయం వేస్తోందని తన సోదరితో చివరిసారిగా మాట్లాడింది.  ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.  తెల్లవారు జామున శవంగా కనిపించింది. అయితే ఇది లారీ డ్రైవర్ల పనే అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. హంతకులు  లారీలను అడ్డుగా పెట్టి ఆమెపై అత్యాచారం చేసి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

 

అయితే ప్రియాంక హత్య విషయంలో పోలీసులు పురోగతి సాధిస్తున్నట్లు తెలుస్తుంది.  హత్య జరిగిందని భావిస్తున్న ప్రదేశంలో  చెట్ల పొదల్లో ఆమె ఇన్నర్ వే, కొన్ని మందు బాటిళ్లు లభ్యమైనట్లు తెలుస్తుంది. కాగా,   ప్రియాంకరెడ్డి హత్యకేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్, క్లీనర్లుగా గుర్తించినట్టు సమాచారం.  రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గా వద్ద పడి ఉన్న ఆమె స్కూటీని పోలీసులు గుర్తించారు. 

 

 కొత్తూరు మండలంలోని జేపీ దర్గా వద్ద నంబరు ప్లేటు లేని ప్రియాంక స్కూటీని గుర్తించారు. నిందితులు కావాలనే నంబరు ప్లేటును తొలగించి స్కూటీని అక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. అలాగే, స్కూటీ కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.  కేసు త్వరిత గతిన దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: