ఉల్లిపాయలను చాకుతో కోసేటప్పుడు వచ్చే కన్నీరు కంటే కొనుగోలు చేసేటప్పుడే ప్రజలకు ఎక్కువగా కన్నీళ్లు వస్తున్నాయి. దీనికి కారణం ఉల్లిపాయల ధర ఆకాశాన్ని తాకడం.. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పుణ్యమంటూ కిలో ఉల్లిపాయలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. కానీ ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ బజార్లలో కేజీ ఉల్లిగడ్డల ధర 80 నుంచి 100 రూపాయల వరకు ఉంది.

మరొకవైపు బీహార్ రాష్ట్రంలో కిలో ఉల్లిగడ్డల ధర 70 నుంచి 80 మధ్యలో ఉంది. అయితే ప్రజలకు భారీ ఉల్లిగడ్డల ధరలు నుంచి ఉపశమనం అందించడానికి ప్రభుత్వం... రాష్ట్ర కోఆపరేటివ్ మార్కెటింగ్ అసోసియేషన్ లిమిటెడ్ తరపున... రాజధాని అయిన పాట్నాలోని కొన్ని ప్రాంతాలలో కేజీ ఉల్లిపాయలను ముప్పై ఐదు రూపాయలకే విక్రయించే విధంగా చర్యలను చేపట్టింది. ఇక ఆ కొన్ని ప్రాంతాలలో తప్ప...వేరే ప్రదేశాల్లో చుట్టుపక్కల ఎక్కడా కూడా కిలో ఉల్లి ధర 35 రూపాయలకు ఉండదు. అయితే పాట్నా కు 80 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో 35 కుటుంబాలు నివసిస్తున్నారు. వాళ్లు మరెవరో కాదు.. త్రిలోకి భిగా గ్రామస్తులు .. అయితే వీరు ఏమంటున్నారంటే.. 'కేజీ ఉల్లిగడ్డల ధర 500 అయినా మాకు ఎటువంటి సమస్యలు లేదండి'... అంటూ బేషరతుగా చెప్తున్నారు.


ఎందుకు? అని వారిని ప్రశ్నించినప్పుడు... వాళ్ళు ఇలా సమాధానం చెప్పారు.. 'మా గ్రామంలో ఉన్న వారంతా శాకాహారులే. మేము ఎల్లిపాయలు గాని, ఉల్లిపాయలు గాని అసలు ఏ కూరలలో ఏ వంటకాల్లో ఉపయోగించము. మద్యం అంటేనే ఆమడ దూరం వెళ్లి పోతాము. కొన్ని శతాబ్దాలుగా.. మేము ఈ ఆహారపు అలవాట్లునే పాటిస్తున్నాను. మా గ్రామంలో విష్ణువు ఆలయం ఉందని... ఈ కారణంగానే వీటిని తినడాన్ని మా పూర్వీకులు ఎప్పుడో మానేశారు.  మా పూర్వీకులు ఉల్లిపాయలను తినలేదని, అవి తినకూడదని చెప్పడంతో... మేము కూడా మా పూర్వీకుల చెప్పినట్లు వారి ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాము" అని చెప్పారు.


ఉల్లిపాయలు తింటే ఏమవుతుందని ఒక జర్నలిస్టు అడిగినప్పుడు.. ఒక గ్రామస్తుడు సమాధానమిస్తూ... " వామ్మో ఉల్లిపాయ తింటే నూకలు చెల్లినట్టే.. గతంలో మా ఊరికి చెందిన కొంతమంది ఉల్లిపాయలను తిన్నారు..ఆ ఉల్లిపాయలను తిన్నవారంతా కొద్ది రోజులలోనే... యాక్సిడెంట్లు జరిగి చచ్చిపోయారు.. అందుకే వాళ్లు చనిపోయిన రోజు నుంచి ఉల్లిపాయలు తినకూడదని మేము నిర్ణయించుకున్నాము" అని చెప్పాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: