గత కొన్ని రోజులుగా వైసీపీ మంత్రులంతా  టిడిపి అధినేత చంద్రబాబు సహా టిడిపి నేతలపై ఘాటు విమర్శలు చేస్తూ విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఇసుక విషయం,  రాజధాని మార్పు పై విషయం, ప్రభుత్వ పాఠశాలలో  ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం విషయం ఇలా ప్రతి విషయంలో ప్రతిపక్ష టిడిపి పార్టీ జగన్ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తుండడంతో అధికార వైసీపీ పార్టీ మంత్రులందరూ టీడీపీ అధినేత చంద్రబాబు సహా టిడిపి నేతల అందరిపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు తో విరుచుకుపడుతున్నారు. కాగా అధికార పార్టీ మంత్రుల వ్యాఖ్యలపై టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 

 

 ఆంధ్రప్రదేశ్ పాలనను  జగన్ సర్కార్ పక్కదోవ పట్టించింది అని...దీంతో  తమ వైఫల్యాలను ప్రజలకు గమనించకుండా పక్కదోవ పట్టించేందుకు వైసిపి మంత్రులందరూ బూతులు మాట్లాడుతున్నారు అంటూ టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అభద్రతాభావంతో ఉన్నారంటూ దేవినేని ఉమ అన్నారు. రాష్ట్రంలోని పాలన గురించి పార్లమెంటులో తమ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడేటప్పుడు కూడా వైసీపీ ఎంపీలు అడ్డుతగులుతున్నారని  దేవినేని ఉమా విమర్శలు గుప్పించారు. వైసిపి పార్లమెంటు సభ్యులు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో  దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు అంటూ దేవినేని ఉమామహేశ్వరరావు కామెంట్ చేశారు. 

 

 

 

 రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత  అసహనం ఎందుకని దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును బూతులు తిడితే ప్రజల్లో మంచి పేరు వస్తుందని వైసీపీ మంత్రులు భావిస్తున్నారు అంటూ టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు. వైసీపీ మంత్రుల మాటలను ఆంధ్రరాష్ట్ర జనాలు అసహ్యించుకుంటున్నారని దేవినేని ఉమ అన్నారు. చివరికి రాష్ట్రంలో రాళ్లు వేసే విష సంస్కృతి కూడా జగన్ సర్కార్ తెరలేపింది అని  దేవినేని ఉమా విమర్శించారు. వైసీపీ మంత్రులతో టిడిపి అధినేత చంద్రబాబును తిట్టిస్తూ  వైయస్ జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు దేవినేని ఉమామహేశ్వరరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: