డాక్టర్ ప్రియాంక రెడ్డి.. ఆమె గురించి విన్న ప్రతిఒక్కరి కంట కన్నీళ్లు.. కోపం కలిపి వస్తున్నాయి. జీవితంపై ఎన్నో ఆశలు.. ఆశయాలతో చదువుకొని.. డాక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేసి చెటాన్‌పల్లి బైపాస్‌ రోడ్డు అండర్‌ బ్రిడ్జి కింద పెట్రోలు పోసి దహనం చేశారు. అయితే అత్యంత దారుణంగా ఆమెని చంపడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. 

 

కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి కేవలం 24 గంటల్లో హత్య చేసిన నిందితులను ఛేదించారు. ప్రియాంక రెడ్డిపై నలుగురు లారీ డ్రైవర్, క్లినర్ కలిసి ఆమెపై హత్యాచారం చేసినట్టుగా నిర్దారించారు. ఆమెను కిడ్నాప్ చేసి నలుగురు కలిసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారని.. అనంతరం ఊపిరి ఆడకుండా చేసి ఆమెను చంపి అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి చంపారని పోలీసులు తేల్చి చెప్పారు. 

 

అయితే ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా నాయకుల నుండి రాజకీయ నాయకుల వరుకు ప్రతి ఒకరు ఆమెకు సంతాపం తెలుపుతున్నారు. అత్యాచారాలు చేసిన వారిని ఒదిలే ప్రసక్తే లేదు అంటున్నారు. ఈ ఘటన మరువకముందే మరో ఘోరాతి ఘోరమైన ఘటన జరిగింది. ఈసారి తమిళనాడులో మరో ఘోరమైన ఘటన వెలుగు చూసింది. 

 

తమిళనాడులో కాంచీపురంలో 20 ఏళ్ల రోజా అనే యువతి మృతదేహం అనుమానస్పద స్థితిలో లభ్యమైంది. ఓ ప్రైవేట్ ప్రాంతంలో ఉరికొయ్యకు వేలాడుతున్న రోజా డెడ్‌బాడీని పోలీసులు స్వాధీనం చేసుకొని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఐతే రోజాను రేప్ చేసి చంపారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నాడు. రోజా ముఖంపై కత్తి గాట్లు, గాయాలు కనిపించడతో ఆమెను చిత్రహింసలు పెట్టి చంపారని అర్థమవుతోంది. చివరిసారిగా ఆమె తన మిత్రుడు రాజేష్‌తో కనిపించింది అని అతడే రోజాను చంపి ఉంటాడని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

 

అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో #JusticeForRoja అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ అవుతుంది. హైదరాబాద్ లో ప్రియాంక, వరంగల్ లో మానస, కాంచీపురంలో రోజా.. ఇలా ఎక్కడ చుసిన మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి అని.. ఈ దేశంలో ఆడవారికి రక్షణ లేదు అంటూ మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: