పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రతి ఆందోళనలోను పెయిడ్ ఆర్టిస్టులే ప్రముఖంగా కనబడుతున్నారు. తాజాగా అమరావతి ప్రాంతంలో జరిగిన పర్యటనలో స్వయంగా చంద్రబాబే పెయిడ్ ఆర్టిస్టుల గురించి మాట్లాడటం అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

పర్యటనకు బస్సులో వస్తు చంద్రబాబు ఓ నేతతో అందరికీ టిఫిన్లు పెట్టించారా అని అడిగారు. ఆ నేత సమాధానమిస్తు లేదు డబ్బులిచ్చేశాం అని చెప్పారు. చెప్పిన నేత వెంటనే డబ్బులు ఇవ్వకపోతే ఎవరు రామంటున్నారు అని కూడా అన్నారు. అంతటితో సంభాషణ ఆగిపోతే సరిపోయేది. చంద్రబాబు మళ్ళీ జోక్యం చేసుకుని అవునులే అంతా పెయిడ్ ఆర్టిస్టులే కదా అని అన్న వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

 

 నిజానికి అంతా పార్టీ వాళ్ళే కాబట్టి ఆఫ్ ది రికార్డుగానో లేకపోతే సరదాగానో అనేకం మాట్లాడుకుంటారు. అలాగే చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనంలో కూడా మాట్లాడుకున్నారు. తన కార్యక్రమాల్లో పెయిడ్ ఆర్టిస్టులదే ప్రధాన పాత్ర అన్నట్లుగా స్వయంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బస్సులో ఉన్న వారే  ఎవరో రికార్డు చేశారు. అలా రికార్డు చేసిన నేత ఎవరో తెలీదు కానీ ఆ వీడియోను బయటకు లీక్ చేశారు.

 

ఎప్పుడైతే ఆ వీడియో లీకైందో చంద్రబాబు  పరువంతా పోయింది. అసలే టిడిపి చేస్తున్న ఆందోళనల్లో మెజారిటి పెయిడ్ ఆర్టిస్టులే అన్న ప్రచారం పెరిగిపోతోంది. మొన్న ఇసుక కొరతకు నిరసనగా  చేసిన 12 గంటల దీక్షలో కూడా పెయిడ్ ఆర్టిస్టులే ఎక్కువున్నారు. అంతకుముందు వర్షాలు, వరదల సందర్భంగా జగన్మోహన్ రెడ్ది, మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది కూడా పెయిడ్ ఆర్టిస్టులే. సరే వాళ్ళని అరెస్టు చేశారనుకోండి అది వేరే సంగతి. మొత్తం మీద యధాలాపంగా బస్సులో చేసిన వ్యాఖ్యలే చంద్రబాబు పరువును సాంతం తీసేసింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: