గత కొంతకాలంగా ఎమ్మార్వో ఆఫీసు వద్దకు అనేకమంది రైతులు పనులు జరగట్లేదు అంటూ తహసీల్దార్ అధికారులపై లేకపోతే... తమపైనే పెట్రోల్, కిరోసిన్ లాంటివి పోసుకుంటూ భయాందోళనలను కల్పిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణం బర్మా కాలనీకు చెందిన తండ్రి కూతుర్ల తహసిల్దార్ కార్యాలయం కు వచ్చి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. తండ్రి పేరు గొర్లె అప్పారావు, తన కుమార్తె పేరు ప్రభ. అయితే వీరిద్దరికీ కొంత భూమి ఉంది. ఆ కొంత భూమిని కాస్త కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. అప్పారావు, ప్రభ కొన్ని రోజులుగా తహసీల్దార్ అధికారికి ఫిర్యాదు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కానీ తహసీల్దార్ కార్యాలయ అధికారులు వీరి ఆవేదన అస్సలు పట్టించుకోలేదు.. ఇంకా చాలా రోజుల నుంచి ఫిర్యాదు చేస్తున్న వారి నుంచి మాత్రం ఎటువంటి సానుకూల స్పందన లేదు.


అయితే.. గురువారం రోజు ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులు.. అప్పారావుకు ఉన్న కొంత భూమిలో కర్రలను రోజు పాతారు. ఇది తెలుసుకున్న అప్పారావు, ప్రభ తీవ్ర బాధకు, ఆవేదనకు గురయ్యారు. వెంటనే కిరోసిన్ డబ్బాలు తీసుకొని.. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి.. అక్కడ తమ ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు..


విచారకరమైన విషయమేమిటంటే అప్పారావు కూతురైన ప్రభ కిరోసిన్ ని తాగింది. దాంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. అక్కడ ఉన్న కొంతమంది హుటాహుటిన ఆమెను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు. ఎంత మంది రైతులు భూ సమస్యలతో బాధపడుతున్నా.. వాటి పరిస్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా.. ఈ రెవిన్యూ అధికారాలు మాత్రం ఏమి న్యాయం చేయడంలేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: