మృగాళ్ళ అఘాయిత్యానికి బలైపోయిన డాక్టర్  ప్రియాంకరెడ్డి జీవితం కేవలం 28 నిముషాల్లోనే ముగిసిపోయిందా ? పోలీసు కమీషనర్ విసి సజ్జనార్ చెప్పిన వివరాలను విన్న తర్వాత అందరూ నిర్ఘాంతపోతున్నారు. శంషాబాద్ ప్రాంతంలోని తొండుపల్లి టోల్ గేట్ దగ్గర లారి నిలిపిన డ్రైవర్, క్లీనర్లే డాక్టర్ పై లైగింక దాడి చేసి హత్య చేయటం సంచలనంగా మారింది.

 

ప్రియాంక స్కూటర్ టైర్ పంక్చర్ అయిన తర్వాత నుండి డాక్టర్ తో మాట్లాడటం, పక్కకు తీసుకెళ్ళటం, లైంగికదాడి చేసి హత్య చేయటం మొత్తానికి నిందితులు తీసుకున్న సమయం కేవలం 28 నిముషాలేనట. టైరు పంక్చర్ అవ్వటమే నిందితులు వేసిన పథకం ప్రకారమిని అర్ధమైపోతోంది.

 

రాత్రి తొండుపల్లి టోల్ గేట్ దగ్గరకు రాగానే ప్రియాంక స్కూటర్ పంక్చర్ అయ్యింది. అదే విషయాన్ని అక్కడే ఉన్న నిందితుల్లో ఒకడైన అరీఫ్ ప్రియాంకకు చెప్పాడు. వెంటనే తాను స్కూటిని తీసుకెళ్ళి పంక్చర్ వేయిస్తానని చెప్పాడు. దాంతో బండిని తోసుకెళ్ళలేని ప్రియాంక కూడా సరే అని చెప్పింది. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగొచ్చిన అరీఫ్ పంక్చర్ వేసే షాపు మూసేసుందని చెప్పాడు.

 

అదే సమయంలో అక్కడే ఉన్న మిగిలిన నిందుతుల్లో శివ పంక్చర్ వేయించటానికి ఇంకో షాపుకు తీసుకెళ్ళమని చెప్పాడు. దాంతో డాక్టర్ తో పాటు నవీన్, చెన్నకేశవులు కూడా బయలుదేరారు. కొంతసేపు బండిని తోసుకెళ్ళగానే నిర్మానుష ప్రాంతమొచ్చింది. అదే అదునుగా అందరూ కలిసి ప్రియాంక నోరు మూసేసి అక్కడే ఆగున్న లారీలోకి ఎక్కించారు. అంటే స్కూటిని పంక్చర్ చేసింది, పంక్చర్ వేయటానికి షాపు దగ్గరకు తీసుకెళ్ళతామని చెప్పింది, నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్ళింది అంతా పథకం ప్రకారమే జరిగింది.

 

ఒకసారి లారీల్లోకి ఎత్తుకోగానే ఇక ప్రియాంక్ నోటిని మూసేసి వాళ్ళిష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. నోటిని గుడ్డతో కట్టేసి నలుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను వదిలేస్తే పోలీసులకు ఎక్కడ ఫిర్యాదు చేస్తుందో ఎక్కడ ఇరుక్కుంటామో అన్న భయంతోనే అదే లారీలో ఆమె గొంతు పిసుకుతు, ముక్కును మూసేసి ఊపిరాడకుండా చేశారు. దాంతో మొత్తం మీద దారుణంగా అత్యాచారం తర్వాత హత్యకు గురైంది. పోస్టు మార్టమ్ లో వివరాల ప్రకారం అఘాయిత్యం, హత్య అంతా కలిపి 28 నిముషాల్లోనే జరిగిపోయినట్లు అర్ధమవుతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: