దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ప్రియాంక రెడ్డి మ‌ర‌ణం ఎంద‌రినో క‌ల‌చివేసింది. మూగ‌జీవాల‌కు వైద్యం చేసే డాక్ట‌ర్ ప్రియాంక‌రెడ్డి...మద్యంమత్తులో కామాంధులుగా మారిన నలుగురి మధ్య నలిగిపోయింది. వారి చేతిలో దారుణ హ‌త్య‌కు గురైంది. అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు లారీడ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితులకు త్వరగా శిక్షపడేలా కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే, కోర్టు ప్రాంగ‌ణంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.

 


ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులు వ్యూహాత్మ‌కంగానే కిరాత‌కంగా ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌ధాన నిందితుడైన‌ లారీడ్రైవర్ మహ్మద్‌పాషా.. క్లీనర్ శివతో కలిసి రాయ్‌చూర్ నుంచి 26వ తేదీన హైదరాబాద్‌కు బయలుదేరాడు. నారాయణపేటలో స్నేహితులు నవీన్, చెన్నకేశవులను ఎక్కించకున్నాడు. 27న ఉదయం 9 గంటలకు శంషాబాద్ టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. అక్కడ నలుగురూ కలిసి సాయంత్రం 6 గంటల వరకు మద్యం తాగుతూనే ఉన్నారు. అక్కడ ప్రియాంక స్కూ టీ పార్క్‌చేయడం గమనించారు. 9.30 గంటలకు తిరిగి వచ్చిన ఆమెపై మద్యంమత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డారు. మృతదేహాన్ని దహనం చేశాక ఆరాంఘర్ చౌరస్తాకు వచ్చి గురువారం ఉదయం ఇటుకను ఖాళీచేశారు. రాజేంద్రనగర్‌లో ఉండే యజమాని శ్రీనివాస్‌రెడ్డికి లారీని అప్పగించి, బస్సులో స్వస్థలాలకు వెళ్లారు.

 


కాగా, ప్రియాంకరెడ్డిపై హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) స్పందించింది. ఈ దారుణ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటుచేసింది. ఈమేరకు ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖాశర్మ ట్వీట్‌చేస్తూ ఇంతటి అకృత్యానికి పాల్పడిన నిందితులకు కఠినశిక్షపడేలా చూస్తామని పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నిందితుల ను వెంటనే అరెస్టుచేసి కఠినశిక్ష పడేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. శ‌నివారం నిందితుల‌ను కోర్టులో హాజ‌రు ప‌ర్చారు. వారిని న్యాయ‌స్థానానికి తీసుకువ‌చ్చిన సంద‌ర్భంగా అక్క‌డ ఉన్న పలువురు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ...రాక్ష‌సుల‌ను ఉరితీయాల‌ని నిన‌దించారు. మాన‌వ మృగాల‌కు ఉరే స‌రైంద‌ని వారు ఆందోళ‌న తెలిపారు. కాగా, వారిని అదుపు చేస్తూ...పోలీసులు నిందితుల‌ను న్యాయ‌మూర్తి ముందు ప్ర‌వేశ‌పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: