ప్రియాంక రెడ్డి హత్యానంతరం హైదరాబాద్ లో మరొక దారుణ సంఘటన చోటు చేసుకున్న విషయం మనకు తెలిసినదే. అయితే ఆ రెండు ఘటనలు మినహాయించి మరొక ఘటన కలకలం రేపుతుంది. కొంతమంది దుండగులు రాజేంద్రనగర్ ప్రాంతంలో ఒక మహిళను బలవంతంగా ఒక వ్యాన్ లోకి ఎక్కించుకుని పట్టుకుపోయారు. ఈ దుండగులు ఆమెను పట్టుకుపోవడాన్ని చూసిన స్థానికులు వెంటనే 100 కి ఫోన్ కాల్ చేసి పోలీసులకు ఈ విషయాన్ని తెలిపారు. దాంతో అలెర్టు అయిన పోలీసులు ఆరాంఘర్, శంషాబాద్ వైపు వెళ్లే వాహనాల్ని తనిఖీ చేస్తున్నారు. అసలు ఎవరీ దుండగులు, ఎందుకు కిడ్నాప్ చేసారు... వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని హత్య చేసిన నలుగురు నిందితులకు.. వీరికి ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇప్పటికే ప్రియాంక రెడ్డి హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఆమెపై అత్యాచారం, హత్య జరిగిన 48 గంటల లోపే మరొక 35-40 ఏళ్ల మహిళను శంషాబాద్ సిద్దులగుట్ట ప్రాంతంలోని బంగారు మైసమ్మ ఆలయం పక్కనే సజీవదహనం చేసారు గుర్తుతెలియని దుండగులు. అయితే ప్రియాంక హత్య జరిగిన ప్రాంతానికి కిలోమీటర్‌ దూరంలోనే ఈ మహిళను పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఆమెపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసారా.. లేకపోతే ఆమె తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అసలు వివరాల్లోకి వెళితే.. బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో ఒక తెలుగు సినిమాకి సంబంధించిన షూటింగ్ నిన్న శుక్రవారం సాయంత్రం జరుగుతున్నది. అయితే ఆ షూటింగ్ ను చూసి కొంతమంది యువకులు తిరిగి వస్తుంటే వారికి.. బంగారు మైసమ్మ ఆలయం పక్కన ఒక మహిళ నిప్పుల్లో కాలిపోతూ కనపడింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన ఆ యువకులు.. గట్టిగా అరుపులు వేయడంతో.. అటువైపు నుంచే వెళ్తున్న కొంతమంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఒకతను 108కి ఫోన్ చేసి అంబులెన్స్ రావాలని కోరగా మరొకరు.. 100 కి డయల్ చేసి పోలీసులకు సమాచారం తెలిపారు. ఈ సమాచారం అందుకున్న డీసీపీ ప్రకాష్‌ రెడ్డి, ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్‌, ఇతర పోలీసు సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆమె శరీరం 70 శాతం కాలిపోయింది. అయితే పోలీసులు మంటలారిపి.. 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయింది. ఆమె ఎవరో గుర్తించడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ సిబ్బంది తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: