ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముందు ప్ర‌క‌టించిన‌ట్లే...మేనిఫెస్టోనే త‌న భ‌గ‌వ‌ద్గీత‌, బైబిల్, ఖురాన్‌గా ముందుకు సాగారు. హామీల అమ‌లులో ఆర్థిక‌ప‌ర‌మైన అంశాల సాకును చూప‌కుండా...అన్ని వ‌ర్గాల‌కు మేలు చేయాల‌నే ల‌క్ష్యంతో ప‌లు ప‌థ‌కాల అమ‌లు, నూత‌న పథ‌కాలు ప్ర‌వేశ‌పెట్ట‌డం, విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవడం చేశారు. అన్ని వ‌ర్గాల‌కు మేలు చేసే ప‌లు నిర్ణ‌యాల‌తో పాటు ప‌లు వ‌ర్గ‌లు మేలు చేసే ప్ర‌త్యేక చొర‌వ‌కు సైతం జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టారు. అలాంటి వాటిల్లో ఇవి కొన్ని

 

– సాలూరు, పాడేరులో గిరిజన వైద్య కళాశాల.
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు గృహ వినియోగ విద్యుత్‌ ఉచితం. 
– పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు.
– వినియోగదారులకు నాణ్యమైన బియ్యం సరఫరాకు శ్రీకాకుళంలో పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభం.
– స్కూల్‌ ఎడ్యుకేషన్, హయ్యర్‌ఎడ్యుకేషన్‌ కమిషన్ల ఏర్పాటు.  
– గిరిజన ప్రాంతాలలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు శ్రీకారం. అరకు, కెఆర్‌పురం, రంపచోడవరం, పార్వతీపురం, పాలకొండ, దోర్నాలలో ఏర్పాటుకు నిర్ణయం. పౌష్టికాహారం పంపిణీకి నిర్ణయం. 
– పలాసలో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన. 
– గిరిజన సలహా మండలి ఏర్పాటు. 


– తాగునీటి సరఫరా కోసం వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు శ్రీకారం.  
– స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం.
– సఖి.. లైంగిక వేధింపులపై ఉక్కుపాదం. 
– సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌లో పేపరు మిల్లు బాధిత రైతులకు ప్రభుత్వ చెల్లింపులు.  
– అర్చకులకు వారసత్వం కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం.  
– మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల ఏర్పాటు.  
– రాష్ట్రంలో 4 పోర్టుల అభివృద్ధికి చర్యలు  
– అవినీతి రహితంగా రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం. 


– వైఎస్సార్‌ ఆదర్శం కింద నిరుద్యోగులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, ఈబీసీ యువతకు వాహనాలు అందిస్తారు. పథకం కింద ట్రక్కుల కొనుగోళ్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది.  లబ్ధిదారుడు రూ.50 వేలు చెల్లిస్తే ట్రక్కు ఇస్తారు. 
– లబ్ధిదారులకు నెలకు కనీసం రూ.20 వేల ఆదాయం వచ్చేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: