దేశంలో మహిళలకు రోజు రోజుకు కనీసం రక్షణ కరువవుతోంది. మహిళలు ఎక్కడికి వెళ్లినా కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలు ఆడవాళ్ళ పై పడి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా వాళ్ళ ఉసురు పోసుకుంటారు మృగాల్లాంటి మగాళ్లు . ఆడది ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఏర్పడింది. ఇల్లు పాఠశాల రోడ్డు ఇలా ఎక్కడ మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయింది. చదువుకునేందుకు వెళితే గురువుల నుంచి... రోడ్డుపై నడిస్తే  ఆకతాయిల నుంచి ఇంటికి వెళితే సొంత వారి నుంచి ప్రతి చోట మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. ఇప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు జరుపుతున్న వారిని శిక్షించేందుకు ఎన్నో కఠిన చట్టాలు తీసుకొచ్చినా... మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు మాత్రం ఎక్కడ కంట్రోల్ అవ్వట్లేదు. మహిళలపై అత్యాచారాలు రోజుకొకటి తెర మీదకు వస్తున్నాయి. కాగా తాజాగా జరిగిన ప్రియాంక రెడ్డి హత్య ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

 

 

 

దేశవ్యాప్తంగా వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి అత్యాచార ఘటనపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. నలుగురు దుండగులు పథకం ప్రకారం వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి ని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి చంపడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.దేశం  మొత్తం వీ వాంట్   జస్టిస్ అంటూ నినదిస్తున్నారు . వైద్యురాలు ప్రియాంక రెడ్డి పై అత్యాచారం చేసి హత్య చేసిన  నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సామాన్యుల మొదలుకుని సినీ రాజకీయ ప్రముఖులు అందరు ప్రతి ఒక్కరు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. 

 

 

 నిందితులకు ఉరిశిక్ష వేయాలని ఆడపిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ కాలంలో రూపొందిన చట్టాలను మార్పు  చేయబోతున్నట్లు తెలిపారు. సత్వర న్యాయ పరిష్కారం లభించే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకురాబోతున్నామని  కిషన్రెడ్డి తెలిపారు. చాలా కేసుల్లో ట్రయల్ కోర్టులు  విధించిన తీర్పులను హైకోర్టులో సవాల్ చేసి శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని ... ఇక నుంచి అలాంటి ప్రక్రియ లేకుండా చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. ట్రయల్  కోర్టులో ఇచ్చిన తీర్పును మరో కోర్టులో సవాల్ చేసే అవకాశం లేకుండా... ఇక మన దేశ అత్యున్నత న్యాయస్థానం లోనే తేల్చుకునేలా  చట్టాలను మారుస్తున్నామని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: