జన నాయకుడు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ధీమా. జనం మెచ్చిన నాయకుడిగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జనం మెచ్చే పాలనను అందిస్తున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో నిర్ణయాలతో  రాష్ట్ర ప్రజలందరికీ సుపరిపాలన అందించే దిశగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పాలన అంటే ఇలాగే ఉండాలి అనే  విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన జరిపి చూపిస్తున్నారు. తన ఆదర్శ పాలనను   పొరుగు రాష్ట్రాలకు సైతం చాటి చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలి అంటూ నినదించేంతగా  తన వినూత్న పథకాలు కీలక నిర్ణయాలతో ప్రభావితం చేస్తున్నాడు. 

 

 

 

 జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే రాజన్న పాలన మరోసారి రాబోతోందని నమ్మిన ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ జనం మెచ్చిన పాలన అందిస్తున్నారు  జగన్మోహన్ రెడ్డి. పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ అవినీతిరహిత పారదర్శక పాలనను అందిస్తున్నారు. జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలందరి నుంచి హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెబుతున్నారు. కానీ కొంతమంది మాత్రం జగన్ పాలన పై పెదవి విరుస్తున్నారు.వారే  భవన నిర్మాణ రంగ కార్మికులు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య పట్టిపీడిస్తోంది. కార్మికులందరూ కనీస ఉపాధి కరువైంది. 

 

 

 

 రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులకు అవస్థలు పడుతున్నారు . ప్రతిపక్షాలు కూడా రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లే వచ్చిందని చెబుతూ విమర్శలు చేయటంతో  నిర్మాణరంగ కార్మికులు జగన్ ప్రభుత్వం పై ఇంకాస్త వ్యతిరేకత పెరిగింది. ఇసుక కొరత  సమస్యతో కనీసం కుటుంబాన్ని పోషించలేక కనీసం కడుపునిండా అన్నం తినలేని పరిస్థితి ఏర్పడింది బాబు నిర్మాణ రంగ కార్మికులకు. అన్న క్యాంటీన్ లను  కూడా జగన్ సర్కార్ మూసివేయడంతో కనీసం 5 రూపాయల భోజనం తో నైనా కడుపు నింపుకుందాం  అనుకున్నా భవన నిర్మాణ రంగ కార్మికుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది . దీంతో జగన్  ఆరు నెలల పాలన తో ఒక భవన నిర్మాణ కార్మికులు మాత్రం మెప్పించలేక పోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: