మన దేశంలో ఎన్ని రకాల చట్టాలు చేసినా మానభంగాలు ఎందుకు ఆగడం లేదు. భయం లేకపోవడం కారణమా. చట్టాలు ఏమీ చేయలేవని ధైర్యమా. చట్టానికి చిక్కకుండా తప్పించుకునే చాకచక్యమా.. చట్టాలు  కఠినంగా లేకపోవడమా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ కారణమే. ఒక తప్పు చేస్తే భయం ఉండాలి. దానికి తగిన శిక్ష ఉండాలి. ఇలా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అయా బెయిల్ మీద వచ్చేసే బాపతు మన దగ్గర ఎక్కువ.

 

దానితో పాటు చూసుకుంటే న్యాయం ఆలస్యం అవడం కీలకమైన కారణం. న్యాయం జరిగేసరికి అది అన్యాయమే అవుతుందని ఎపుడో మహాకవి శ్రీశ్రీ చెప్పాడు. అంటే కోర్టుల చుట్టూ తిరగలేక జీవితాలు ముగిసిపోతాయి. దాంతో ఎవరూ కూడా ముందుకు రాని పరిస్థితి. అంటే ఫాస్ట్ గా న్యాయం లభిస్తేనే తప్ప ఈ రేపిస్టుల పాపాలకు ముగింపు ఉండదన్నది అంతా అంగీకరిస్తారు. డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణం తరువాత ఇపుడు మరోమారు మన చట్టాల పదును ఎంత అన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

 

 

ఇదిలా ఉంటే చాలా దేశాల్లో మనతో పోలిస్తే కఠిన చట్టాలు ఉన్నాయి. అక్కడ ఇంత విచ్చలవిడిగా రేప్  కేసులూ కూడా లేవు. ఈ కఠిన చట్టాలు సత్వర న్యాయం వల్లనే అక్కడ ఆడవారికి కొంతైనా న్యాయం జరుగుతోందని అంటున్నారు. అలా రేపిస్టుల పట్ల కఠినంగా చట్టాలు  ఉన్న దేశాలు తీసుకుంటే సౌదీలో రేప్ చేశారని రుజువు అయితే చాలు ఆ రేపిస్టు తలను నడిరోడ్డుపైన నరికేస్తారు.

 

ఇక చైనాలో ఉరి శిక్ష విధిస్తారు. లేకపోతే నేరం చేసిన వాడి పురుషత్వం  నాశనం చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరైన అత్యాచారం చేశారని రుజువు అయితే  నేరం జరిగిన నాలుగు రోజుల్లోనే నిందితుడిని ఉరికంబం ఎక్కిస్తారు. ఇక ఉత్తర కొరియాలో అత్యాచారం చేస్తే కనుక తుపాకీలతో దారుణంగా కాల్చి చంపుతారు.

 

మరి మనం ఏం చేస్తున్నాం...  కోర్టులు విచారణలో  ఇలా ఏళ్ళకు ఏళ్ళు గడచిపోతుంది. ఒక కోర్టు ఉరి శిక్ష వేస్తే రెండవ కోర్టుకు నిందితుడు వెళ్తాడు. ఆ మీదట సుప్రీం కోర్టుకు వెళ్తాడు. ఇలా ఎన్నో అవకాశాలు. ఈ లోగా కొన్ని తరాలు మారిపోతున్నాయి. మరి కొన్ని వేల అత్యాచారాలు జరిగిపోతున్నాయి. అందువల్ల మన చట్టాలను మార్చాల్సిందేనని అంతా డిమాండ్ చేస్తున్నారు.

 

దీని మీద కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నిందితులకు ట్రయల్ కోర్టు తరువాత నేరుగా సుప్రీం కోర్టుకే  విచారణ జరిగేలా చట్టాల్లో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. అదే విధంగా రేప్ చేసిన వారికి ఉరి శిక్ష ఖాయం చేస్తూ చట్టాలో మార్పులు తెస్తామని కూడా ఆయన చెప్పారు. మొత్తానికి చూసుకుంటే ఈ రకమైన మార్పులు కనుక రాకపోతే ఈ దేశంలో ఆడవారి మీద ఇలాగే అత్యాచారాలు జరుపుతూనే ఉంటారు. మార్పులు రావాలి, కిరాతకుల ఆగడాలు అణగిపొవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: