2014 సమయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానుసారం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలుగా విడగొట్టిన తరువాత నవ్యాంధ్రకు జరిగిన తొలి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మద్దతుతో అప్పట్లో టీడీపీ పార్టీ ఘన విజయాన్ని దక్కించుకుని చంద్రబాబు ముఖ్య మంత్రి కావడం జరిగింది. అయితే అప్పట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా,  విభజన హామీల విషయమై ఇచ్చిన మాటను తప్పడంతో, మొన్నటి ఎన్నికల్లో ప్రజలు టిడిపిని తిప్పి కొట్టి, అత్యధిక మెజారిటీతో వైసిపికి పట్టడం గట్టడం జరిగింది. ఇక ఆ పార్టీ తరపున బాధ్యతలు అందుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, తొలి రోజు నుండే ప్రజాకర్షక పాలనను నిర్వహిస్తూ మెజారిటీ ప్రజల మెప్పుతో ముందుకు సాగుతున్నారు. ఇకపోతే నేటితో జగన్ పాలనకు 6 నెలలు ముగియడంతో పలువురు ఇతర పార్టీ నాయకులు ఆయన పాలన పై తమ వంతుగా రిపోర్ట్ అందిస్తున్నారు. 

 

అయితే ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ పార్టీ నుండి జగన్ పాలన పై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా టిడిపి మాదిరిగా జగన్ గారి పాలన పై పూర్తిగా నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం చూస్తుంటే, కళ్యాణ్ గారు కూడా టిడిపి తానులో ముక్కే అని ప్రజలకు పూర్తిగా అర్ధం అవుతోందని అంటున్నారు వైసిపి నాయకులు. వాస్తవానికి పాలన చేపట్టిన తొలిరోజు నుండి ప్రజా సంక్షేమమే ద్యేయంగా ముందుకు సాగుతూ, ఎప్పటికప్పుడు ప్రజల కోసం సరికొత్త పధకాలు ప్రవేశ పెడుతూ నడుస్తున్న జగన్ గారి పై, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి తాము భావించినట్లుగానే వ్యతిరేకత కనపరుస్తుందనేది తెలిసిందే అని, 

 

కానీ రాష్ట్రంలో పరిస్థితులు మరియు జరుగుతున్న అభివృద్ధిని కళ్లారా చూస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం చూస్తుంటే, ఆయన టిడిపితో కలిసి మా ప్రభుత్వంపై కక్షపూరితం గానే ఆ విధంగా తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు ప్రజలందరికీ స్పష్టంగా అర్ధం అవుతుందని అంటున్నారు. ఇక ఇటువంటి పనులతో పవన్, ప్రజల వద్ద తనకు ఉన్న కొద్దిపాటి మంచి పేరును కూడా చేజేతులా నాశనం చేసుకుంటున్నారని, కావున ఇకనైనా ఆయన వాస్తవాలు తెలుసుకుని జగన్ గారి పాలన గురించి నిజాయితీగా మాట్లాడితే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు...... !! 

మరింత సమాచారం తెలుసుకోండి: