పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయ‌న కుమారుడు మ‌ద్యం మ‌త్తులో చేసిన త‌ప్పుడు ప‌ని పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కింది. నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ త‌మ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా....బిల్డింగ్‌పై నుంచి తోసి వేయడానికి ప్రయత్నించాడని  బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్ సంజన  ఆరోపించారు. రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడివున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, చుట్టూ పలువురు చూస్తున్నా అతన్ని ఎవరూ అడ్డుకోలేద‌ని పేర్కొంటూ మాదాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

 

హైదరాబాద్, హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్ లో శనివారం అర్థరాత్రి రాత్రి రెండు గంటల సమయంలో తన స్నేహితురాలితో  కలిసి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సంజ‌న పేర్కొంది. ఆశిష్ త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, తనపై మద్యం బాటిళ్లతో దాడికి దిగాడని, ఆశీష్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న స‌మ‌యంలోనే...బౌన్సర్లు అక్క‌డే ఉన్నార‌ని..వారి సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని లిఖితపూర్వ‌కంగా సంజ‌న పోలీస్ స్టేషన్‌లో నందీశ్వ‌ర్‌గౌడ్‌పై కుమారుడుపై దాఖ‌లు చేసిన ఫిర్యాదులో ఆమె తెలిపారు. ఆశీష్ వేధింపుల‌ను చూస్తూ ఉన్నారే త‌ప్ప‌టించి....హోటల్ యాజమాన్యం కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని భయభ్రాంతులకు గురై తప్పించుకున్నామని అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తే నిజాలు బయటకు వస్తాయని ఆమె పేర్కొంది.

 

కాగా, మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటన తర్వాత ఆశిష్ గౌడ్ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఇదిలాఉండ‌గా, ఆశీష్‌ గౌడ్‌ గతంలో ఓ క్రిమినల్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడని, అతడిపై పలు ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ఇప్ప‌టికే డాక్ట‌ర్ ప్రియాంక‌రెడ్డి హ‌త్య ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టిస్తుండ‌గా...సంజ‌న ప‌ట్ల అస‌భ్య ప్ర‌వ‌ర్తన‌, అందులోనూ స్టార్‌హోట‌ల్లో ఉన్న ప‌బ్‌లో జ‌ర‌గ‌డం సంచ‌ల‌నంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: