అది మే 30.2019 వ సంవత్సరం. ఆరోజు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఇసుక పోస్తే రాలనంత జనం.. ఎందుకంటే ఏపీకి కొత్త  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రోజు. అతనే జనం మెచ్చిన నాయకుడు జగన్. ఇకపోతే జననేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, సీఎంగా ప్రమాణం చేసిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘ఆరునెలల్లోగా మీ అందరిచేత మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా’ అని ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం ప్రజారంజక పాలన చేసి ఆరు నెలల కాలంలో ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే, మంచి ముఖ్యమంత్రిగా పేదల గుండెల్లో నిలిచిపోయారు.

 

 

ఇదే కాకుండా ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు. ఇక వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నవంబరు 30కి ఆరు నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకట వెలువరించింది. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఎన్నికల మేనిఫేస్టోలోని 82 శాతం హామీలను అమలుచేయడం లేదా ఆ దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిపింది.

 

 

వివిధ వర్గాల సంక్షేమం, అవినీతిరహిత పాలన, పౌరుల సమస్యల సత్వర పరిష్కారానికి అనేక చర్యలు చేపట్టిందని పేర్కొంది. ఇదే క్రమంలో ఆరోగ్యశ్రీలో భాగంగా రోగుల అలవెన్సు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిసెంబరు 2 గుంటూరులో ప్రారంభించనున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో ఉదయం 11.00 గంటలకు ఈ పథకం ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

 

 

ఇకపోతే ఇప్పటికే నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం, మంత్రి పదవుల్లో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వదమే కాకుండా త్వరలో జరగబోయే మార్కెట్‌ యార్డుల చైర్మన్ల నియామకంలో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన ఘనత కూడా జగన్‌ కు దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: