28 ఏళ్ల మాధవి అగ్నిహోత్రి మధ్యప్రదేశ్ లోని భోపాల్‌ లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అఫ్ పోలీస్ బాధ్యతలను నిర్వహిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని చత్తార్‌పూర్ జిల్లాలోని నౌగోన్‌ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ చౌబే పెద్ద రౌడీ. అతను ఇప్పటికే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కలిపి 15 హత్యలు చేసిన కేసుల్లో నిందితుడిగా తేలింది. కానీ అతన్ని పట్టుకోవడానికి ఎంత మంది పోలీసులు ట్రై చేసినా ప్రతిసారి విఫలమవుతున్నారు. నిజానికి బాలకృష్ణ చౌబే దగ్గర ఎప్పుడూ తుపాకులు ఉంటాయి. ఎవరిపైన అయిన అనుమానం వస్తే.. ఏం మాట్లాడకుండా డైరెక్ట్ గా కాల్చి చంపే ఈ నేరస్తుడిని పట్టుకోడానికి మధ్యప్రదేశ్ పోలీసులు బాగా తంటాలు పడుతున్నారు.

చత్తార్‌పూర్ పోలీసులు ఇక వాడిని పట్టుకోవడం కష్టసాధ్యమని భావించి ఆశలను వదిలేశారు. చివరికి..ఎవరైనా అతన్ని పట్టిస్తే 10,000 రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించారు. కానీ ఫలితం లేదు. అయితే ఇటీవల చత్తార్‌పూర్ జిల్లాలోని నౌగోన్‌ ప్రాంత సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా..షాట్ ఫుట్ లో గోల్డ్ మెడలిస్ట్ అయిన మాధవి అగ్నిహోత్రికు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. దాంతో ఆమె ఆ ప్రాంతంలో ఉన్న కేసులను పరిశీలించసాగింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ చౌబే గురించి మొత్తం తెలుసుకుంది సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాధవి. బాలకృష్ణ చౌబే చాలా ధైర్యవంతుడు.. ఫేస్ బుక్ లో కూడా చాలా ధైర్యంగా అతని ఫోటోలని రెగ్యులర్ గా అప్ డేట్ చేస్తూ ఉంటాడు. అయితే దాంట్లో అతని ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇక ఇది చూసిన సబ్ ఇన్స్పెక్టర్ మాధవి...బాలకృష్ణ చౌబే కు ఫోన్ చేసి బందెలఖండి యాసలో.. ' హాయ్ అండి.. నా పేరు రాధా లోది.. నేను చత్తార్‌పూర్ నుంచి మాట్లాడుతున్న.. నేను ఢిల్లీ లో కూలి పనులు చేస్తా. ప్రస్తుతం మా ఊరికి వచ్చాను.' అంటూ మాట్లాడింది.

ఇన్స్పెక్టర్ మాధవి వాయిస్ విన్నా బాలకృష్ణ చౌబే.. వెంటనే ఆమె పైన మనసు పారేసుకున్నాడు.. తర్వాత మూడు రోజుల పాటు మాధవి బాలకృష్ణ ల మధ్య ఫోన్ చాటింగ్ నడిచింది.. చివరికి అతను ఆమెను పెళ్లి చేసుకుంటా అని మ్యారేజ్ ప్రపోసల్ చేశాడు. అయితే వివాహం చేసుకునే ముందు ఒకసారి కలుద్దామని బాలకృష్ణ చౌబే లేడీ ఇన్స్పెక్టర్ ని అడగగా ఆమె సరే అన్నది. ఇక వాళ్లు కలుసుకోవడం కోసం ఉత్తర ప్రదేశ్- మధ్యప్రదేశ్ సరిహద్దు దగ్గర ఉన్న ఒక దేవాలయంను ఎంచుకున్నారు.

గన్నులతో ఇతర ఆయుధాలతో కొంతమంది పోలీసులు మామూలు దుస్తుల్లో వచ్చి అతని కోసం గుడి దగ్గర వెయిట్ చేస్తున్నారు. లేడీ ఇన్స్పెక్టర్ మాధవి పింక్ సల్వార్ కుర్తా వేసుకున్నారు. పర్సులో ఒక పిస్టల్ భద్రత కోసం ఉంచుకున్నారు. హీరో లెవల్లో ఒక బైక్ పై బాలకృష్ణ చోబె దేవాలయం దగ్గరికి వచ్చాడు. బండి పక్కన పార్క్ చేసి.. ఇన్స్పెక్టర్ మాధవిని చూస్తూ నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లబోతుంటే.. అప్పటి వరకే కాపలా కాసిన పోలీసులు వెనకనుంచి వెంటనే అతన్ని పట్టుకున్నారు. దాంతో దెబ్బకు షాక్ అయిన బాలకృష్ణ అతని దగ్గర ఉన్న ఒక పిస్టల్ ని తీయబోయాడు... కానీ అప్రమత్తమైన పోలీసులు అతని దగ్గర నుంచి ఆ పిస్టల్ తీసుకొని సీజ్ చేశారు. ఇన్స్పెక్టర్ మాధవి.. బాలకృష్ణ చౌబే కళ్ళొలోకి చూస్తూ 'రాధా వచ్చింది' అనగానే పాపం బుక్ అయిపోయిన బాలకృష్ణ షాక్ అయిపోయాడు. అనంతరం నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: