జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రాయలసీమ పర్యటన చాలా హాట్ హాట్ గా సాగుతోంది. ఈ నేపథ్యంలో కడప జిల్లా రైల్వే కోడూరు లో పవన్ కళ్యాణ్ కి ఆ ప్రాంతంలో ఉన్న అభిమానులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా వేదికపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రాంతాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాంతంలో కరువు ఉంటుందని అందరూ అనుకుంటున్నారు కానీ రాయలసీమ ప్రాంతంలో కరువు కావాలని ఇక్కడున్న రాజకీయ నేతలు సృష్టించారు అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి గతంలో మాదిరిగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్. ఇంగ్లీష్ మీడియం విషయంలో కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్...జగన్ ని ముఖ్యమంత్రిగా ఎందుకు సంబోధించారో దానికి వివరణ ఇచ్చారు పవన్.

 

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే నేను కూడా గౌరవంగా… గౌరవనీయులైన ముఖ్యమంత్రి అని సంబోధిస్తా అంటూ కొంతమందికే ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తే జగన్ రెడ్డి అని సంబోధిస్తా అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా వైసిపి పార్టీ నాయకులపై తనకి ఎటువంటి ద్వేషం లేదని పేర్కొన్నారు. మరియు అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతాంగం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ త్వరలో రైల్వేకోడూరులో నివాసం ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

 

అంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలో తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపై అధికార పార్టీకి చెందిన నేతలు చేస్తున్న దాడులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్. పవన్ కళ్యాణ్ సినిమాలో కనబడేది తక్కువ మాత్రమే బయట నాకు చాలా ఉంది అన్నట్టుగా హెచ్చరించినట్లు పవన్ కళ్యాణ్ తన కార్యకర్తల జోలికొస్తే వేరే విధంగా విషయం ఉంటుంది అన్నట్టుగా పవన్ వార్నింగ్ ఇచ్చాడు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: