మహారాష్ట్రలో ఎన్నో కీలక మలుపులు తర్వాత చివరికి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. ఎన్సీపీ కాంగ్రెస్ మద్దతుతో శివసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మొదట రాత్రికి రాత్రి మంతనాలు జరిపి మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు అన్నింటిని పటాపంచలు చేస్తూ బిజెపి తెరమీదకి  వచ్చి  దేవేంద్ర ఫడ్నవిస్ ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బిజెపి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం  బలనిరూపణ   చేసుకోకపోవడంతో చివరికి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కుప్పకూలి పోయింది. దీంతో ఆ తర్వాత ముందు నుంచి అనుకున్నట్టుగానే శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. 

 

 

 

 అయితే ఇటీవలి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉద్ధవ్ థాక్రే . కాంగ్రెస్ ఎన్సీపీ పార్టీలతో మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ తమ పార్టీ భావజాలం లో ఏ మాత్రం మార్పు ఉండదు అంటూ వ్యాఖ్యానించారు ఉద్దవ్ థాకరే. అంతేకాకుండా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎప్పుడు తన  మిత్రుడే  అంటూ స్పష్టం చేశారు. తాను హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉన్నానంటూ ఉద్ధవ్ థాక్రే  తెలిపారు. ఎప్పటికీ తన హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడ  తన భావజాలాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గడిచిన ఐదేళ్లలో శివసేన పార్టీ బిజెపి ప్రభుత్వానికి వెన్నుపోటు పొడవలేదు  అని తెలిపారు. 

 

 

 

 అయితే మహారాష్ట్రకు తాను  లక్కీ ముఖ్యమంత్రి ని అంటూ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు తనను వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు తనతో నడుస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతు పలకారని... గతంలో తాను ఎవరితో అయితే ఉన్నానో  ఇప్పుడు వాళ్లు తనకు ప్రత్యర్థులుగా  మారిపోయారు అంటు ఉద్ధవ్ థాక్రే  వ్యాఖ్యానించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అదృష్టం ప్రజల ఆశీస్సులు అని కలిపి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తనnu నిలబెట్టాయని ఉద్దవ్ థాక్రే  అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాలని  గతంలో కూడా ఎవరితో ఎక్కడ అనలేదు అంటూ చెప్పుకొచ్చారు. తాను మహా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రయోజనాల కోసమే పని చేస్తానని... అర్ధరాత్రి రాజకీయాలు చేయనంటు వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం ఉద్ధవ్ థాక్రే మాటలు ఆసక్తికరంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: