హైదరాబాద్ షాద్నగర్ సమీపంలో వైద్యుల ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. నలుగురు కామాంధులు పక్క పథకంతో అమాయకురాలైన  ఆడపిల్ల ని అతి దారుణంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ఘటన అందరినీ కలిచివేసింది. అత్యాచారం హత్య కేసు నిందితులకు ఉరిశిక్ష పడాలి అంటూ  దేశం మొత్తం నినదిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులకు  కఠిన శిక్ష పడాలి అంటూ దేశం మొత్తం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలను తీసుకు వచ్చినప్పుటికీ  కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉండటం  విమర్శలు గుప్పిస్తున్నారు. 

 

 

 

ఒక ప్రియాంక రెడ్డి  హత్యతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు . తన కూతురు హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత దేశమంతటా చూసిన ఘటన ఇదే. దీంతో దేశం మొత్తం లోని సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు అందరు ఈ ఘటనపై  స్పందిస్తూ  నిందితులకు కఠిన శిక్షలు పడాలంటు  కోరుకుంటున్నాడు. తాజాగా షాద్ నగర్ దారుణ ఘటనపై  టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ స్పందించారు. రేప్ అండ్  మర్డర్ అనేది ఒక ఆడవాళ్ళ అంశమే కాదు... ఎందుకు అబ్బాయిలు ఈ విషయం  గురించి మాట్లాడడానికి ముందుకు రావడం లేదు... ఎందుకు నిరసన తెలుపడం లేదు...ఎందుకు  గొంతు ఎత్తడం లేదు... అమ్మాయిలంటే వస్తువులు కాదు...  మీ సొంతం అనుకోవడానికి... సమాజంలో గౌరవం స్వేచ్ఛ ఆడవాళ్ళ హక్కు అని గుర్తుంచుకోవాలి.

 

 

 

 అబ్బాయిలకు తల్లిదండ్రులు చెప్పండి బాధ్యతగా నడుచుకుని  సత్ప్రవర్తన అలవర్చుకోవాలని... అంతా జరిగి పోయిన తర్వాత రియాక్షన్ కాదు యాక్షన్  కావాలంటు  తనదైన శైలిలో హీరో వెంకటేష్ స్పందించారు. ప్రస్తుతం ఈ దారుణ ఘటన కు పాల్పడిన నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో పోలీసులు రిమాండ్ లో  ఉన్నారు. కాగా  తాజాగా బాధితురాలు ప్రియాంకా రెడ్డి పేరును దిశగా మార్పు చేస్తూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటినుంచి బాధితురాలి పేరును ఎక్కడ ప్రస్తావించ కూడదని బాధితురాలి పేరు కు బడులు  దిశ అనే పేరును ప్రస్తావించాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: