రెండు తెలుగు రాష్ట్రాల  విషయంలో ఎంత కాదనుకున్నా పోలికలు ఉంటాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల పాలనాశైలి  వేరుగా ఉన్న దాదాపుగా ఆరు దశాబ్దాల పాటు ఉమ్మడిగా ఏపీ ఉంది. రెండు చోట్ల ఒక్కటే భాష, ఒకటే భావోద్వేగం, ఒక్కలాగే సమస్యలు ఉంటాయి. అందువల్ల ఒక చోట ఏదైనా నిర్ణయం తీసుకుంటే మరో చోట కావాలనుకుంటారు. అందులో తప్పులేదు కూడా. అన్నదమ్ముల బిడ్డల్లాంటి వారు ఉభయ రాష్ట్రాల ప్రజానీకం.

 

ఇంతకీ విషయం ఏంటంటే కేసీయార్ ఇపుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రియాంకరెడ్డి హత్యాచారం నేపధ్యంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇపుడు ఏపీలోనూ పెద్ద డిమాండ్ గా వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమావేశంలో కేసీయార్ మహిళా కండక్టర్లకు ఒక వరాన్నే ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో వారు రాత్రి ఎనిమిది దాటితే పనిచేయాల్సిన అవసరం లేదు. 

 

వారి నైట్ డ్యూటీ అంటే అంతవరకే పరిమితం చేస్తూ కేసీయర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది నిజంగా ఆహ్వానించతగిన నిర్ణయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళా కండక్టర్లు ఎంతో శ్ర‌మకు ఓర్చి బస్సుల్లో పనిచేస్తున్నారు. వివిధ రకాలైన ప్రయాణీకుల మధ్య నిలబడి వారి విధులని నిర్వహిస్తారు. వారు ఇపుడు రాత్రి పదకొండు గంటల వరకూ విధులు నిర్వహించాల్సివస్తోంది. కొన్ని సార్లు అర్ధరాత్రి కూడా అవుతోంది.

 

వారి భద్రతకు కూడా ఇది ఇబ్బందిగా ఉంది. దాంతో కేసీయార్ చక్కనైన నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం అవుతోంది. జగన్ మీద దీనిపై ఏపీ ఆర్టీసీ నుంచి వత్తిడి రావచ్చు. ప్రియాంకారెడ్డి హత్యోదంతంతో అందరిలో భయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో జగన్ సైతం మహిళా భద్రతకు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మహిళా కండక్టర్లకు ఏపీలో కూడా రాత్రి ఎనిమిది గంటలకే విధులు ముగించేలా జగన్ సైతం ఉత్తర్వులు జారీ చేస్తారేమో చూడాలి. ఏది ఏమైనా కేసీయార్ నిర్ణయంతో ఇపుడు జగన్ కూడా అడుగులు వేయల్సివస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: