పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నం అయి ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా బరిలోకి దిగిన పవర్ స్టార్, అనూహ్యంగా రెండు చోట్ల దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఇక ఆయన జనసేన పార్టీ కూడా కేవలం ఒకే ఒక్క సీట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఇకపై పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేసేలా ప్రణాళికలు రచించుకుని పవన్ ముందుకు సాగుతున్నారు. 

 

అయితే గడిచిన ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలన పై పూర్తిగా పెదవి విరుస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలపై చాలావరకు విమర్శలు ఎదురయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు టిడిపితో రహస్యంగా కలిసి నడుస్తున్నారని, అందుకే రాష్ట్రంలో జగన్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా కావాలనే ఆయనపై బురద చల్లుతున్నారని వైసిపి నాయకులు సహా పలువురు ప్రజలు సైతం ఆయనపై విమర్శలు చేసారు. కాగా నేడు ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసలు తెలుగు భాషను రాయడం కానీ, 

 

లేదా చదవడం కానీ వచ్చిన వారు చాలా తక్కువ మంది ఉన్నారని, తెలుగు భాషను బ్రతికించుకోవలసిన బాధ్యత వారికి లేదా అంటూ పవన్ విమర్శలు చేయడం జరిగింది. అయితే పవన్ వ్యాఖ్యలపై కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా తెలుగు భాష కోసం ఎంతో పాటు పడుతున్నట్లైతే, తన గత సినిమాల్లో హిందీ, ఇంగ్లీష్ సాంగ్స్ ఎందుకు పెట్టుకున్నట్లు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఈ వార్త ప్రస్తుతం సినిమా మరియు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. పవన్ ఉన్నట్లుండి తెలుగు హీరోలను ఎందుకు టార్గెట్ చేసారో అర్ధంకావడం లేదంటూ మరికొందరు సందేహంతో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తుండడం విశేషం.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: