తెలంగాణ ఆర్టీసీకి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సంధి కుదిరిన తర్వాత బస్సులో ఛార్జీలను కిలోమీటర్ కు 20 పైసలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. చివరికి ఎవరు ఏ విధంగా లాభపడ్డారో తెలియదు కానీ ఈ 52 రోజులు మాత్రం వారికీ వీరికీ మధ్య జరిగిన డ్రామాలో నష్టపోయింది సాధారణ ప్రజలు. సరే ఎవరైనా నష్టపోయిన తర్వాత సమస్య కొలిక్కి వస్తే తిరిగే వారికి ఏదో ఒక విధంగా పరిహారం చేయాల్సింది పోయి తిరిగి ప్రజలకే అధిక భారం మోపడం మన సర్కార్ స్పెషాలిటీ అనే చెప్పాలి.

 

కావున రాష్ట్ర ప్రభుత్వం అధిక ఛార్జీలు పెంచడంతో పాటు బస్సుల్లో కనీస ఛార్జీలను కూడా అధికారులు వెల్లడించారు.  పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జిని 10 రూపాయలగా నిర్ణయించగా ఎక్స్ప్రెస్ బస్సు లో కనీస చార్జీల రూపంలో 15 రూపాయలు వసూలు చేయనున్నారు. ఇకపోతే డీలక్స్ బస్సు లో 20 రూపాయలు, సూపర్ లగ్జరీ లో 25 రూపాయలుగా నిర్ణయించారు. రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్ ఏసీ బస్సులో 35 రూపాయలగా కనీస చార్జీగా నిర్ణయించగా వెన్నెల స్లీపర్ కనీస చార్జీలను 70 రూపాయలకు పెంచారు

 

గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం రౌండింగ్ కి 5 రూపాయలు యధావిధిగా కొనసాగుతుండగా కనీస చార్జీ మాత్రం 10 రూపాయలకు పెంచారు. ఆర్డినరీ కనీస ధర 5 రూపాయల నుండి 10 రూపాయలకి, గరిష్టంగా 30 రూపాయల నుండి 35 రూపాయలకు పెంచారు metro express కనీసంగా అయినా 10 రూపాయలలో ఎలాంటి మార్పులు లేవు కానీ గరిష్ట ధర 30 నుండి 35 రూపాయలకు పెంచారు. మెట్రో 10 రూపాయల నుండి 15 రూపాయలకు, గరిష్టాన్ని 30 రూపాయల నుండి 40 రూపాయలకు పెంచారు.

 

ఇక ఈ ప్రక్రియ మొత్తం సరిగ్గా జరిగేందుకు కొత్త ధరలను టిమ్ యంత్రాల్లో నిక్షిప్తం చేస్తున్నారు. పెరిగిన చార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: