లోకంలో హింస అనేది ఈ నాటిది కాదని తెలుస్తుంది. ఎందు కంటే అనాది నుండి మానవుడు మరొకరిపై ఆదిపత్యం కోసం పోరాటం చేసేవాడు. క్రమక్రమంగా అది కౄరహింసగా మారి మనిషే అడవి మృగంగా మారిపోయాడు. ఇకపోతే 1939-40 సంవత్సరాల మధ్య జరిగిన ఘోర హింసా కాండ గురించి తెలుసుకుంటే ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది.  

 

 

ఇటలీలోని కోరేజియోలో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుంటే వరుసగా ముగ్గురు మహిళలు మిస్సయ్యారు. అన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్టరీగా మారిన కేసును ఛేదించే క్రమంలో ఆ ముగ్గురి ఇళ్లను సోదా చేయగా లెటర్లు దొరికాయి. వాటిలో ఓ మహిళ అడ్రస్ రాసి ఉంది ఆ అడ్రస్ ఆధారంగా పోలీసులు ఆ ఇంటికి వెళ్లగా భయానక నిజాలు తెలిశాయి.

 

 

దానికి కారణం లియోనార్డా సియాన్సియుల్లి అనే మహిళ. ఇటలీలోని కోరేజియోలో నివసించిన ఆమె సబ్బులు, కేకుల తయారీలో మంచి పేరు సంపాదించింది.. దాన్ని అడ్దం పెట్టుకుని ముగ్గురు మహిళలను  మూఢనమ్మకాల చాటునా అత్యంత కిరాతకంగా చంపింది. వారి శరీర భాగాలన్నీ పూర్తిగా పానకంలా తయారయ్యే వరకు వేడి చేసి వాటితో సబ్బులు కేకులు చేసి ఇంటికి వచ్చిన మహిళలకు పంచిపెట్టింది. అంతే కాకుండా ఆ రక్తంతో కరకరలాడే టీ కేక్స్ తయారు చేశాను. అవి చాలా రుచిగా ఉండేవి. వాటిని మా ఇంటికి వచ్చే మహిళలకు ఇచ్చేదాన్ని. వారు కూడా వాటిని తినేవారు. నేను కూడా ఆ కేకులు ఎంతో ఇష్టంగా తిన్నాను అని తెలిపింది.

 

 

ఇదంతా ఎందుకు చేశావని పోలీసులు ప్రశ్నించగా వారితో పెళ్లి తర్వాత 17 సార్లు గర్భం దాల్చిన తనకు మూడు సార్లు గర్భస్రావం కాగా, పదిసార్లు పిల్లలు పుట్టిన వెంటనే చనిపోయారట. చివరికి నలుగురిని మాత్రమే బతికించుకో గలిగిందట. దీంతో తనకు పిల్లలంటే ప్రేమ పెరిగిపోయింది. వారికి ఏం జరిగినా తట్టుకోలేకపోయేది.

 

 

అది కాస్తా చాదస్తంగా మారింది. మూఢ నమ్మకాలకు దారి తీసింది.  ఈ నేపథ్యంలో ఆమె తన గ్రామంలో తెలిసిన మహిళ ద్వారా తాంత్రిక విద్యలు నేర్చుకుంది. ప్రాణానికి ప్రాణమే సమాధానం అని, ముగ్గురు మహిళల ప్రాణాలను బలిస్తే తన కొడుకు ప్రాణాలు నిలుస్తాయని భావించింది. దీంతో బలిచ్చే మహిళల కోసం ఆలోచించసాగింది. ఆ క్రమంలోనే ఆమె ఈ మారణకాండకు తెరలేపింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: