పోలీసులంటే ప్రజలను రక్షిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలి. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా డ్యూటీ లో నిర్వహించాలి . ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వారి కి గట్టి వార్నింగ్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది పోలీసులు దానికి భిన్నంగా ఉంటున్నారు . కొంత మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎన్నో రిస్కులు చేసి ప్రజలను కాపాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటే...ఇంకొంత మంది మాత్రం  పోలీసులపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నారు . ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తు ... పోలీసులపై ప్రజలకు చెడు అభిప్రాయం ఏర్పడే ఎలా చేస్తున్నారు. తప్పతాగి వీరంగం సృష్టిస్తుంన్నారు . కొంతమంది పోలీసులు ప్రజల నుండి ఎన్నో ప్రశంసలు అందుకుంటూ విధి నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం పోలీస్ జాబ్ కి ఉండే  గౌరవాన్ని మంట కలుపుతున్నారు. 

 

 

 

 ఇక్కడ ఓ పోలీస్ కానిస్టేబుల్ అలాంటి పనే చేసాడు.  తప్పతాగి వీరంగం సృష్టించారు  నలుగురికి రక్షణ కల్పించి ఆదర్శంగా నిలవాల్సింది  పోయి... ఏకంగా ఫుల్లుగా  మందు కొట్టి  ఇష్టం వచ్చినట్లుగా రచ్చ చేశాడు. నైట్ డ్యూటీ లో ఉన్న కానిస్టేబుల్ రోడ్డుపై వీరంగం సృష్టించటంతో  ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మందు కిక్కు లో ఉన్న ఆ కానిస్టేబుల్ కనీసం ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ ని అని కూడా మర్చిపోయి రోడ్డుపైనే రచ్చ  చేస్తూ వీరంగం సృష్టించారు. రోడ్డుపై అడ్డంగా పడుకుని నానా యాగీ చేశాడు ఆ కానిస్టేబుల్. కానిస్టేబుల్ చేసిన రచ్చతో  చాలా మంది జనాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి అవడంతో పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

 

 

 ఫలక్నుమా పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య రాత్రి డ్యూటీ చేయాల్సి ఉంది .కానీ  డ్యూటీ చేయాల్సింది వదిలేసి ఫుల్లుగా మందేసి రోడ్డు పై వీరంగం సృష్టించారు. దీంతో  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే బాధ్యతగా  వ్యవహరించాల్సిన కానిస్టేబుల్ ఇలా ఫుల్లుగా మందు కొట్టి రచ్చచేస్తే   ప్రజలకు రక్షణ ఎవరు  కల్పిస్తారు  అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న అధికారులు సదర్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశారు. ఇక ఫలక్నామ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఛార్జ్ మెమో జారీ చేశారు. కాగా  ఈ ఘటనపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన ఒక కానిస్టేబుల్ ఇలా తయారైతే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: