ఓ వైపు చంద్రబాబు, మరో వైపు పవన్ కళ్యాణ్ ఇవాళో రేపో ఎన్నికలు ఉన్నట్లుగా హడావుడి చేస్తున్నారు. నిజానికి ఆరు నెలల క్రితమే కొత్త సర్కార్ ఏర్పడింది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఎవరి ప్లేస్ ఏంటన్నది జనం చూపించేశారు కూడా. మళ్ళీ ఎన్నికలు వచ్చేందుకు అక్షరాలా నాలుగున్నరేళ్ళ సమయం ఉంది. ఇదిలా ఉంటే టూర్ల మీద టూర్లు చేస్తూ బాబు, పవన్ జగన్ని టార్గెట్ చేస్తున్నారు. 

 

మరి ఇది ఎంతవరకొ జనానికి రీచ్ అవుతోందన్నది ఆలోచిస్తే  ఇపుడు రాజకీయం గురించి ఆలోచించే ఓపిక తీరిక సగటు ప్రజలకు లేదు, ఒక ప్రభుత్వం పనిచేయడానికి అవసరమైన సూచనలు మాత్రం విపక్షాలు చేస్తే చాలు. కానీ ఏపీలోని రెండు పార్టీల నాయకులకు జగన్ కులం, మతం ప్రధాన అంశాలు అయిపోయాయి.

 

వాటి వల్ల జనానికి ఒరిగేది ఏముంది. ప్రజల సమస్యలు తీర్చేందుకు జగన్ అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టాడు. వాటిలో ఏవైనా లోపాలు ఉంటే విపక్షాలు సలహాలు ఇవ్వాలి. ఇక ఏపీ గాయపడిన రాష్ట్రం.  భారీ ఎత్తున అప్పులు ఉన్నాయి. ఆర్ధిక ఇబ్బందులో ఉంది. వీలు అయితే తమ మేధావితనంలో సలహా సూచనలు ఇచ్చి ఏపీని  ఒడ్డున పడేసే ప్రయత్నం చేయాలి.

 

అంతే తప్ప ఎన్నికలు ఏమీ లేకపోయినా ఏపీలో రాజకీయం చేస్తూ సర్కార్ని అస్థిరపరచే విధంగా కులాల కుంపట్లు, మతాల మధ్య చిచ్చు రాజేయడం ఎంతవరకూ సమంజసమని అంతా అంటున్నారు. ఇక ఏపీలో విపక్షాలకు విమర్శించేందుకు అవకాశం లేకుండా జగన్ పాలన చేస్తున్నారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

 

ఇసుక కొరత అన్నారు అది అయిపోయింది. ఇంగ్లీష్ అన్నారు ఇపుడు చంద్రబాబే యూ టర్న్ తీసుకున్నారు. పోలవరం పనులు మొదలయ్యాయి. రాజధాని నిర్మాణపు పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరి సంక్షేమ కార్యక్రమాల విషయం చూసుకుంటే అన్ని వర్గాలకు కూడా ఏదో ఒకటి అందేలా డిజైన్ చేస్తున్నారు

 

దీంతో విపక్ష నాయకులకు ఏం మాట్లాడాలో తెలియక ఇలా మతం, కులం అంటూ కాలక్షేపం చేస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. జగన్ విషయంలో అయితే ఊపిరాడని పనులతో బిజీగా ఉన్నారు. మంత్రులు సైతం శాఖాపరంగా పట్టు సంపాదించే ప్రయత్నంలో ఉన్నారు, ఈ పరిస్థితుల్లో తమ ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన విపక్షాలు ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగడం ద్వారా పని చేస్తున్న ప్రభుత్వాన్ని  చెడగొడుతునంట్లుగా ఉందని కూడా అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: