ఈ మధ్యకాలంలో రోడ్డు మీద జరిగే ప్రమాదాలతోనే ప్రజలు బాధలు పడుతుంటే దీనికి తోడుగా రెల్వే సంస్ద కూడా విరివిగా ప్రమాదాలకు లోనవుతుంది. ప్రజలు బయటకు ప్రయాణం నిమిత్తం వెళ్లి ఇంటికి వచ్చేవరకు వారి ప్రాణాలకు అభయం లేదు. రోజురోజుకు మరణాలతో లోకం నిండిపోతుంది.

 

 

ఇకపోతే ఏపీలో పెద్ద ప్రమాదం తప్పింది. కడప జిల్లా రైల్వే కోడూరు స్టేషన్‌ వద్ద తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగీ పక్కకు ఒరిగి పోయింది. అయితే ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగీ పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే రైలును నిలిపివేశాడు. ఇక ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదట. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి మరమ్మతు చర్యలు చేపట్టారు.

 

 

దీంతో అటువైపుగా వెళ్లాల్సిన రైళ్లను తాత్కాలికంగా నిలిపి వేశారు. ఇకపోతే 15 రోజుల క్రితం తిరుపతిలో కేరళ ఎక్స్ ప్రెస్ రైల్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. న్యూఢిల్లీ నుంచి త్రివేండం వెళుతున్న కేరళ ఎక్స్ ప్రెస్ తిరుపతి ఏర్పేడు రైల్వే స్టేషన్ కూతవేటు దూరంలో పట్టాలు తప్పింది. ప్యాంట్రి కార్ భోగి చక్రం విరిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.కేరళ ఎక్స్ ప్రెస్ లోకో పైలైట్ చాకిచక్యంగా ట్రైన్ నిలిపివేయడంతో ప్రమాదం తప్పిందన్నారు.

 

 

లేదంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మద్యకాలంలో ఇదే మార్గంలో జరిగిన ఈ రెండు ఘటనలతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రయాణం అంటేనే భయపడే పరిస్దితులు తలెత్తుతున్నాయి. ఇలా జరిగే ఘటనల వల్ల ప్రాణాలుపోతే ఆ నిర్లక్ష్యానికి బాధ్యులుగా ఎవరుంటారు అనే ప్రశ్న ప్రతివారిలో తలెత్తుతుంది. ఇప్పటికే ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల ఎందరి ప్రాణాలో మట్టిలో కలిసిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: