మల్లెపూలు అంటేనే అదో రకం మత్తు, గమ్మత్తు, మల్లెపూలతో ఎన్ని కవితలు, ఎన్ని సినీ గీతాలు, అసలు మల్లెపూలు లేని రొమంటిక్ లైఫ్ ఉంటుందా. మదనదేవునికి ఇష్టమైన  పూలు మల్లెపూలు. మల్లెపూలు ఘొల్లుమన్నవీ పక్కలోన  అని నాడి ఒక సినీ కవి అంటే ఏదో ప్రేమోత్సాహంతో రాసిన పాట అనుకున్నారు, కానీ ఇపుడు నిజంగా మల్లెపూలు పక్కనే గొల్లుమంటున్నాయి. గోల పెట్టిస్తున్నాయి. కిలో అచ్చంగా మూడు వేల రూపాయలట.

 

ఎక్కడో కాదు పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో మల్లెపూలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. మల్లె  చల్లగా ఉంటుందంటారు కానీ రేటుతోనే మంటలు పుట్టించేస్తోంది. తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తూండడంతో మల్లెపూల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేశాయి.   తమిళనాడులోని దేవలయాలు ఎక్కువగా ఉన్న మధురై నగరంలో  కిలో మల్లె పూలు అచ్చంగా మూడు వేల రూపాయలుగా ధర పలుకుతోంది అంటే ఆ డిమాండ్ ఏ రేంజిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇంత రేటు ఉన్న కూడా భక్తులు మాత్రం పూలను కొనుగోలు చేయడమే విచిత్రం. దాంతో పూల వ్యాపారులు పండుగ చేసుకుంటున్నారుట. అదేంటో ఈ దేశంలో ఒక్కసారిగా ఉల్లిగడ్డలకు రెక్కలు వచ్చాయి. కిలో వందకు పైగా ధర పలుకుతూంటే ఇపుడు మల్లెపూలు కూడా నేనేం తక్కువ అంటూ మూడు వందల రెట్లు పైకి ధరకు ఎగబాకాయి. చూస్తూంటే రానున్న రోజుల్లో మరేమి సరుకులు, పూల ధరలు నింగిని అంటడానికి చూస్తున్నాయోనని సగటు ప్రజలు ఆవే దనతో  అంటున్నారు.

 

నిజానికి ప్రక్రుతి సైతం ఇపుడు పగపట్టినట్లుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పంటలు చేతికందకుండానే గంగపాలు అవుతున్నాయి. శీతాకాలలో పెద్ద ఎత్తున వానలు కురియడంతో మల్లె తోటలు మటాష్ అయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు. అదే విధంగా ఉల్లి గడ్డల పంటను సైతం రెండు నెలల క్రితం కురిసిన భారీ వానలే పొట్టనపెట్టుకున్నాయి. ఇలా ప్రక్రుతి విక్రుతి కావడానికి మానవాళి స్వీప తప్పిదాలే ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: