కల్తీ లోకం మొత్తం కల్తీ తినే ఆహార పదార్ధాలు కల్తీ. మనషుల మనుసులు కల్తీ. అమ్మ పాలలో కల్తీ. నాన్న ప్రేమలో కల్తీ. ఇప్పుడు లోకాన్ని ఏలుతుంది కల్తీ. ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే మనం రోజువాడే ప్రతి వస్తువుల్లో కల్తీ పెరిగిపోయి రోగాలబారిన పడుతున్నాము. ఇక  రాజులాగా అవినీతీ అందరి మనుసులను శాసిస్తుంటే దానికి మంత్రిలాగ తనపని తాను చేసుకుంటు వెళ్లుతున్నారు కొందరు నీచులు..

 

 

ఇప్పుడు విద్యార్ధులకు పెట్టే భోజనంలో కూడా కల్తీ ఏర్పడ్డది. నవసమాజ నిర్మాణం కోసం అందరు నడుం కట్టాలని చెప్పే ప్రభుత్వాలు మొదట వారు ఆచరిస్తే కదా ప్రజలు ఆచరించేది. ఇకపోతే యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు ఏలుతున్న రాజ్యం ఉత్తరప్రదేశ్‌.. ఇక్కడ  మధ్యాహ్న భోజన పథకం మరోసారి అభాసుపాలైంది. అదేమంటే విద్యార్థులకు పెట్టే భోజనంలో ఎలుక రావడం కలకలం రేపింది. ఈ ఆహారం తిన్న తొమ్మిది మంది విద్యార్థులతో పాటు ఓ టీచర్‌ కూడా అస్వస్థతకు గురయ్యి ఆస్పత్రిపాలయ్యారు. ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతుండటంతో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

ఇక ఈ సంఘటన తాలూకూ వివరాలు పరిశీలిస్తే ముజఫర్‌నగర్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఆరో, ఎనిమిదో తరగతి విద్యార్థులకు మంగళవారం ఆహారం వడ్డించారు. అయితే అది తిన్న కాసేపటి తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో.. భోజనం వడ్డించే పాత్రను పరిశీలించగా అందులో చనిపోయి ఉన్నఎలుక కనిపించింది. దీంతో వెంటనే విద్యార్థులను, ఆ టీచర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

 

కాగా ఈ భోజనాన్ని హాపూర్‌కు చెందిన జన్‌ కల్యాణ్‌ సంస్థా కమిటీ అనే ఎన్జీవో తయారు చేసినట్లు సమాచారం. దీని పై సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేపట్టారు. ఇకపోతే కనీసం చదువుకుంటున్న పిల్లలకు అయినా సరైన భోజనం పెట్టలేకపోతున్న పాఠశాలలు ఇలాంటివి చాలానే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి గొప్పగా చెప్పుకుంటాయి కాని లోన లొటారం పైన పటారం లాగే ఉంది వ్యవస్దలో ప్రతి ప్రభుత్వ పనితీరు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: