ఈ మధ్యకాలంలో ఎంతో మంది అనవసరంగా మానసిక అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా రోజుకు కొన్ని వందల మంది ఆత్మహత్య చేసుకొని మృతి చెందుతున్నారు. అది మాత్రమే కాదు.. రోజు మరణించే వారిలో 10 శాతం సహజ మరణాలు కాగా 40శాతం ఆత్మహత్యలు 50 శాతం అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. 

 

ఇప్పుడు ఎవరు మృతి చెందిన సరే అది హత్య అంట.. అత్యాచారం చేసి చంపేశారు.. రోడ్డు యాక్సిడెంటు జరిగింది... అక్కడిక్కడే 10 మంది మృతి.. తాగుబోతు తండ్రి కూతురిపై అత్యాచారం.. యువతిపై సామూహిక అత్యాచారం అనంతరం పెట్రోల్ పోసి హత్య.. ఇవి నేటితరం హత్యలు.. 

 

ఇంకా ఆత్మహత్యలు... తల్లిదండ్రులు మొబైల్ కొనివ్వలేదు అని ఒకరు ఆత్మహత్య చేసుకుంటే మరొకరు మొబైల్ వల్ల ఆత్మహత్య.. మరొకరు వివాహేతర సంబంధం... భార్యని వదిలి ఉండలేక భర్త ఆత్మహత్య. ఇలా రోజు ఎన్నో ఘటనలు.. సహజ మరణాలు కేవలం 10 శాతం అంటే ఎంత దారుణమో ఆలోచించండి. 

 

ఇంకా వివరాల్లోకి వెళ్తే.. ఈరోజు మహారాష్ట్రలో ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకోబోయాడు. మహారాష్ట్రలోని థానేలో భగవాన్‌ అనే వ్యక్తి నడిరోడ్డుమీద అందరూ చూస్తుండగా ఆత్మహత్యాయత్నం చేశాడు. కాల్వా ప్రాంతంలోని ఓ బ్రిడ్జికి తాడుకట్టి మెడలో తాడు వేసుకుని బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. 

 

అయితే ఈ ఘటనను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమయిన థానే ట్రాఫిక్‌ పోలీసులు చురుగ్గా స్పందించి.. అతన్ని కాపాడారు. స్థానికుల సహాయంతో సురక్షితంగా కిందకు దించి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. నడిరోడ్డు మీద ఉరేసుకొని చనిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరు భగవాన్‌ అని, కొడుకు చనిపోయిన దగ్గరి నుంచి అతని మానసిక పరిస్థితి సరిగా లేదని సమాచారం. ఏది ఏమైనప్పటికి నడిరోడ్డుపైనే ఇంత దారుణంగా ఆత్మహత్య యత్నం చేశాడు అంటే చుడండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: